Abn logo
Oct 23 2021 @ 07:03AM

Ghat roadలో ప్రమాదాల నివారణకు చర్యలు

                          - మంత్రి ఏవీ వేలు


ప్యారీస్‌(Chennai): రాష్ట్రంలోని ఘాట్‌ రోడ్లలో నడిపే వాహనాలు మలుపుల వద్ద ప్రమాదానికి గురికా కుండా పటిష్ఠ చర్యలు తీసుకోనున్నట్లు రహదారుల శాఖ మంత్రి ఏవీ వేలు పేర్కొన్నారు. సచివాలయంలో శుక్రవారం రోడ్డు భద్రతపై మంత్రి ఏవీ వేలు అధ్యక్ష తన జరిగిన సమావేశంలో రహదారుల శాఖ చీఫ్‌ ఇంజనీర్లు, ప్రజా పనుల శాఖ అధికారులు, మినీ ఓడ రేవుల అధికారులు పాల్గొన్నారు. మంత్రి వేలు మాట్లాడుతూ వెడల్పు అధికంగా ఉన్న రహదారులు, నాణ్యమైన ఫుట్‌పాత్‌ కలిగిన రోడ్లను ఆధునికీకరించి ప్రమాదాలు జరుగకుండా తగిన ఏర్పాట్లు చేపట్టనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో రవాణా పరిశోధన విభాగం ఇటీవల నిర్వహిం చిన సర్వేలో ఘాట్‌రోడ్లలో సుమారు 740 మలుపులున్నట్లు తెలిసిందని, 500 మీటర్ల పరిధిలో గత మూడేళ్లలో ఐదు భారీ రోడ్డు ప్రమాదాలు జరిగాయని, భవిష్యత్‌లో ఇవి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాల్సిందిగా తమ శాఖ అధికారులకు ఉత్తర్వు జారీ చేశారు. వాహన చోదకులు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లఘించకుండా ప్రమాదాలు అరికట్టేందుకు ప్రభుత్వానికి సహకరించాలని మంత్రి వేలు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption