Advertisement
Advertisement
Abn logo
Advertisement
Mar 30 2021 @ 17:13PM

కరోనా కేసుల కట్టడికి జీహెచ్‌ఎంసీ చర్యలు

హైదరాబాద్: హైదరాబాద్ నగరం‌లో కరోనా కేసుల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో సిటీలో కేసులు పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. కరోనా కేసుల కట్టడికి జీహెచ్ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టింది. జీహెచ్ఎంసీ పరిధిలోని చాంద్రాయణగుట్ట, మలక్‌పేట్, శేరిలింగంపల్లి.. చింతల‌బస్తీ, గోల్కొండ, ఎల్బీనగర్, హిమాయత్‌నగర్, కూకట్‌పల్లి, జీడిమెట్లను కరోనా హాట్‌స్పాట్‌గా జీహెచ్ఎంసీ ప్రకటించింది. కరోనా కట్టడికి మరోసారి కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధం అవుతుంది. ఇప్పటికే సిటీలో మాస్క్ మస్ట్ అనే ప్రచారంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు.  ప్రత్యామ్నాయ చర్యలు చేపడితే కొంతవరకైనా కరోనా పాజిటివ్ కేసులు రాకుండా ఉంటాయని జీహెచ్ఎంసీ అభిప్రాయం వ్యక్తం చేస్తుంది. 

Advertisement
Advertisement