GHMC కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

ABN , First Publish Date - 2021-11-01T19:27:45+05:30 IST

జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు.

GHMC కార్యాలయం ఎదుట బీజేపీ కార్పొరేటర్ల ధర్నా

హైదరాబాద్: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు  బీజేపీ కార్పొరేటర్లు ధర్నా చేపట్టారు. గత ఎనిమిది నెలల్లో ఒకే ఒకసారి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. డివిజన్లలో నిధులు లేక అభివృద్ధి పనులు చేయలేకపోతున్నామన్నారు. అభివృద్ధి పనుల  విషయంలో ప్రజల నుండి రోజు ఎదురయ్యే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోతున్నామని తెలిపారు. నిధులు విడుదల కాకా మధ్యలోనే కాంట్రాక్టర్లు పనులను ఆపేస్తున్నారన్నారు. కాంట్రాక్టర్లను ప్రశ్నిస్తే నిధులు విడుదల కాక అప్పులపాలై ఇద్దరు కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నారని అంటున్నారని చెప్పారు. కార్పొరేటర్‌లను ఎమ్మెల్యేలు, అధికారులు గుర్తించే పరిస్థితి లేదన్నారు. మరుగుదొడ్లు, మురికి కాలువలు, వీధిలైట్లు చూసుకునే వర్కర్లుగా కార్పొరేటర్‌ల పరిస్థితి ఉందని వ్యాఖ్యానించారు. వారం రోజుల్లో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయకపోతే నిరంతరంగా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ఆందోళన చేపడతామని బీజేపీ కార్పొరేటర్లు హెచ్చరించారు. 

Updated Date - 2021-11-01T19:27:45+05:30 IST