Abn logo
Sep 17 2021 @ 17:50PM

గ్రేటర్‌ పరిధిలో 310 క్రేన్‌లు ఏర్పాటు

హైదరాబాద్‌: నగరంలో గణేష్ నిమజ్జనం కోసం గ్రేటర్‌ పరిధిలో 310 క్రేన్లను ఏర్పాటు చేసినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. ట్యాంక్‌బండ్‌పై 40 క్రేన్‌లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా 310 కి.మీ. మేర శోభా యాత్ర జరుగనుందన్నారు.  వ్యాధులు వ్యాపించకుండా పరిసరాల శుభ్రత కోసం ప్రతి 500 మీటర్లకు శానిటేషన్ టీంను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దాదాపు 8000 పైగా సిబ్బందిని గణేష్ నిమజ్జనానికి వినియోగిస్తున్నామన్నారు. అన్ని ప్రాంతాల్లో అదనపు లైటింగ్ ఏర్పాటు చేసినట్లు  కమిషనర్ లోకేష్‌కుమార్ తెలిపారు. 

ఇవి కూడా చదవండిImage Caption