LIVE: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-04T13:39:01+05:30 IST

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్లు లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.

LIVE: జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్లు లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగనుంది. 150 డివిజన్లలో 30 కేంద్రాల్లో కౌంటింగ్ జరుగనుంది. బల్లియా బరిలో 1,122 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. 30 సర్కిళ్లలోని 30 ప్రదేశాల్లో లెక్కింపు కేంద్రాల కోసం 150 హాళ్లను సిద్ధం చేశారు. ప్రతి హాల్‌లోనూ 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఒక్కో టేబుల్‌పై 1000 ఓట్ల లెక్కింపు వంతున ఒక రౌండ్‌లోనే 14 వేల ఓట్ల లెక్కింపు పూర్తవుతుంది. నగరంలోని మెజారిటీ డివిజన్లలో 28 వేలలోపు ఓట్లు పోలైన విషయం తెలిసిందే. దాంతో, రెండు రౌండ్లలోనే పూర్తి ఫలితాలు వెలువడనున్నాయి. అన్ని హాళ్లలో గరిష్ఠంగా మూడు రౌండ్‌లలోనే లెక్కింపు పూర్తి కానుంది. 11 వేల ఓట్లు పోలైన మెహిదీపట్నం ఫలితం ఒకే రౌండ్‌లోనే రానుంది. మరోవైపు కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.  

Updated Date - 2020-12-04T13:39:01+05:30 IST