జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం..

ABN , First Publish Date - 2020-12-04T13:42:59+05:30 IST

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల కౌంటింగ్‌ ప్రారంభం..

హైదరాబాద్: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరగనుంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పాస్‌లు ఉన్నవారిని మాత్రమే పోలీసులు లోపలకి అనుమతించారు. ఓట్ల లెక్కింపు కోసం ప్రతి హాల్‌లో 14 టేబుల్స్‌ ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్‌కు కౌంటింగ్ సూపర్‌వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను ఏర్పాటు చేశారు. 150 డివిజన్లకు 30 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు కార్యక్రమం జరుగుతోంది. కౌంటింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను నిషేధించారు. మరికాసేపట్లో 1122 మంది అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. మెజార్టీ డివిజన్ల రెండో రౌండ్‌లో ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటల్లోపు రెండో రౌండ్‌ పూర్తయ్యే అవకాశం ఉంది.


Updated Date - 2020-12-04T13:42:59+05:30 IST