పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

ABN , First Publish Date - 2020-11-21T16:15:03+05:30 IST

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ మొండిచేయి ఇచ్చింది. చివరి వరకు పెండింగ్‌లో పెట్టిన సీట్లను ఎమ్మెల్యే వర్గానికి కేటాయించింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నాలుగు డివిజన్‌లలో సిట్టింగ్‌లు ఉన్నారు. బోరబండ నుంచి బాబా ఫసియుద్దీన్‌కు అధిష్ఠానం ఓకే చెప్పింది.

పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌

హైదరాబాద్ : జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో సిట్టింగ్‌లకు టీఆర్‌ఎస్‌ మొండిచేయి ఇచ్చింది. చివరి వరకు పెండింగ్‌లో పెట్టిన సీట్లను ఎమ్మెల్యే వర్గానికి కేటాయించింది. జూబ్లీహిల్స్‌ నియోజకవర్గంలో నాలుగు డివిజన్‌లలో సిట్టింగ్‌లు ఉన్నారు. బోరబండ నుంచి బాబా ఫసియుద్దీన్‌కు అధిష్ఠానం ఓకే చెప్పింది. మిగతా మూడు డివిజన్‌లు అయిన యూసుఫ్‌గూడ, రహ్మత్‌నగర్‌, వెంగళరావునగర్‌లో ఉన్న సిట్టింగ్‌లకు టికెట్‌ ఇవ్వొద్దని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అధిష్ఠానానికి సూచించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వారు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారని చెప్పారు. పార్టీ కోసం పనిచేసిన తన వర్గానికి టికెట్‌ ఇవ్వాలని కోరారు. దీంతో అధిష్ఠానం ఆ సీట్లను పెండింగ్‌లో పెడుతూ వచ్చింది. చివరకు ఎమ్మెల్యే వైపు మొగ్గు చూపించింది. వెంగళరావునగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌ ఈ విషయాన్ని ముందే గ్రహించి బీజేపీలో చేరారు. మిగతా ఇద్దరు కార్పొరేటర్‌లు ముందుకు ఎలా వెళ్లాలి అనే అంశంపై అనుచరులతో చర్చిస్తున్నారు. యూసుఫ్‌ గూడ నుంచి రాజ్‌కుమార్‌పటేల్‌, రహ్మత్‌నగర్‌ నుంచి సీఎన్‌ రెడ్డి, వెంగళరావునగర్‌ నుంచి దేదీప్య పోటీకి దిగుతున్నారు. షేక్‌పేట డివిజన్‌ నుంచి సత్యనారాయణ యాదవ్‌, ఎర్రగడ్డ నుంచి కంజర్ల పల్లవి యాదవ్‌ టికెట్‌ పొందారు. ఐదు డివిజన్లలో కొత్తవారే బరిలో ఉండటం గమనార్హం.

Updated Date - 2020-11-21T16:15:03+05:30 IST