జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుపై సంబరాలు

ABN , First Publish Date - 2020-12-05T05:34:39+05:30 IST

ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇన్‌చార్జీలుగా ఉండి ప్ర చారం చేసిన డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలపొందడంతో సంబ రాలు నిర్వహించారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపుపై సంబరాలు
ధర్మారంలో సంబరాలు జరుపుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

పెద్దపల్లి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఇటీవల జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఇన్‌చార్జీలుగా ఉండి ప్ర చారం చేసిన డివిజన్లలో తమ పార్టీ అభ్యర్థులు గెలపొందడంతో సంబ రాలు నిర్వహించారు. శుక్రవారం జీహెచ్‌ఎంపీ ఎన్నికల కౌంటింగును నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ దాదా పు 55 స్థానాలకు, బీజేపీ 49 స్థానాలను, ఎంఐఎం 44, కాంగ్రెస్‌ పార్టీ 2 స్థానాల్లో గెలుపొందింది. జిల్లాకు చెందిన నాయకులు ప్రచారం నిర్వ హించిన డివిజన్లలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు గెలుపొందడంతో జిల్లా నేత ల్లో హర్షం వ్యక్తం అవుతున్నది. జిల్లా ఇన్‌చార్జీ మంత్రి, రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఇన్‌చార్జీగా ఉండి ప్రచారం నిర్వహించిన 135వ డివిజన్‌ వెంకటాపురం అభ్యర్థి సరితాకిషోర్‌ విజయం సాధించ డంతో ధర్మారం మండలంలో ఆ పార్టీ నాయకులు సంబరాలు నిర్వ హించారు. పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేత 143వ డివిజన్‌ తార్నాక అభ్య ర్థి శ్రీలత శోభన్‌రెడ్డి తరపున ప్రచారం నిర్వహించగా ఆమె విజయం సాధించారు. శాసనమండలి ప్రభుత్వ విప్‌ తానిపర్తి భానుప్రసాదరావు 92వ డివిజన్‌ వెంకటేశ్వరకాలనీ అభ్యర్థి మన్నె కవితారెడ్డి తరపున ప్ర చారం చేసి గెలిపించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ 136వ నేరేడ్‌మెట్‌ డివిజన్‌లో అభ్యర్థి కొత్తపల్లి మీనాఉపేందర్‌రెడ్డి తరపున ప్ర చారం నిర్వహించి ఆమె గెలుపునకు దోహదపడ్డారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి 139వ డివిజన్‌ ఈస్ట్‌ఆనంద్‌బాగ్‌ అభ్యర్థి ప్రేమ్‌ సాగర్‌రావు పక్షాన ప్రచారం నిర్వహించి ఆయనను విజయతీరానికి తీ సుకవెళ్లారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ 137వ డివిజన్‌ వినాయకనగర్‌ డివిజన్‌ అభ్యర్థి పుష్పలత తరపున ప్రచారం నిర్వహిం చినప్పటికీ అక్కడ బీజేపీ సి రాజ్యలక్ష్మి అభ్యర్థి గెలుపొందారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారా యణ 98వ డివిజన్‌ అమీర్‌పేట అభ్యర్థి కేతినేని సరళ తరపున ప్రచా రం నిర్వహించగా ఆమె టీఆర్‌ఎస్‌ అభ్యర్థిపై విజయం సాధించారు. గత ఎన్నికల్లో ఇదే డివిజన్‌ నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి తరపున సో మారపు ప్రచారం నిర్వహించి టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థిని గెలిపించారు. ఇంకా జిల్లాకు చెందిన ఆయా పార్టీలకు చెందిన నాయకులు జీహెచ్‌ ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-05T05:34:39+05:30 IST