చివరి రోజు చివరి నిమిషం వరకు నామినేషన్లు

ABN , First Publish Date - 2020-11-21T18:46:26+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకియ్రలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వానికి శుక్రవారం తెరపడింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి

చివరి రోజు చివరి నిమిషం వరకు నామినేషన్లు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రకియ్రలో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల పర్వానికి శుక్రవారం తెరపడింది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలోని వివిధ డివిజన్ల నుంచి ఆయా పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. పార్టీల నాయకులు, కార్యకర్తలు, అనుచరగణంతో కలిసి భారీ ర్యాలీగా వచ్చినామినేషన్లు దాఖలు చేశారు. .


కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ 4 డివిజన్లకు ...

కుత్బుల్లాపూర్‌ : కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలోని 4 డివిజన్ల పరిధిలో శుక్రవారం 27 మంది అభ్యర్థులు 44 నామినేషన్లు దాఖలు చేశారు. మూడురోజుల్లో కలిపి మొత్తం 38 మంది అభ్యర్థులు 62 నామినేషన్లు వేశారు. వీరిలో రంగారెడ్డి నగర్‌ డివిజన్‌(127)లో 10 మంది అభ్యర్థులకు 14 నామినేషన్లు (బీజేపీ-3, సీపీఐ-1, కాంగ్రెస్‌-2, టీఆర్‌ఎస్‌-3, టీడీపీ-1, ఎంఐఎం-1, స్వతంత్ర అభ్యర్థి-3), సుభా్‌షనగర్‌ డివిజన్‌ (130)లో 17 మంది అభ్యర్థుల 26 నామినేషన్లు (బీజేపీ-5,  టీఆర్‌ఎస్‌-9, కాంగ్రెస్‌-2, టీడీపీ-1, జనసేన-1, టీజేఎస్‌-1, స్వతంత్రులు-7), కుత్బుల్లాపూర్‌ డివిజన్‌ (131)లో ఆగురు అభ్యర్థులకు 12 (టీఆర్‌ఎస్‌-4, బీజేపీ-3, టీడీపీ-1, కాంగ్రెస్‌-2 స్వతంత్ర అభ్యర్థి-2), జీడిమెట్ల డివిజన్‌ (132)లో ఐదుగురు అభ్యర్థులకు 10 (బీజేపీ-3, కాంగ్రెస్‌-3, టీఆర్‌ఎస్‌-3, స్వతంత్ర అభ్యర్థి-1) నామినేషన్లలను ఆయా డివిజన్ల ఆర్వోలకు అందజేశారు. 


గాజులరామరం సర్కిల్‌ 4 డివిజన్లకు... 

గాజులరామారం సర్కిల్‌ పరిధిలోని 4 డివిజన్‌లకు శుక్రవారం 46 మంది అభ్యర్థులు 69 నామినేషన్లు దాఖలు చేశారు. మూడురోజుల్లో కలిపి మొత్తం 62 మంది అభ్యర్థలు 87 నామినేషన్లు దాఖ లు చేశారు. వీరిలో గాజులరామారం డివిజన్‌ (125)లో 19 మంది అభ్యర్థులకు 26 నామినేషన్లు (బీజేపీ-5, కాంగ్రెస్‌-4, టీఆర్‌ఎస్‌-5, స్వతంత్రులు-12), జగద్గిరిగుట్ట డివిజన్‌ (126)లో 17 మంది అభ్యర్థులకు 23 నామినేషన్లు (బీజేపీ-2, సీపీఐ-1, కాంగ్రెస్‌-1, టీఆర్‌ఎస్‌-8, జనసేన-1, స్వతంత్రులు-10), చింతల్‌ డివిజన్‌(128)లో 10 మంది అభ్యర్థులకు 14 (బీజేపీ-5, కాంగ్రెస్‌-1, టీఆర్‌ఎస్‌-5, టీడీపీ-2, స్వతంత్రులు-1), సూరారం డివిజన్‌ (129)లో 16 మంది అభ్యర్థులకు 24 (బీజేపీ-5, సీపీఐఎం-3, కాంగ్రెస్‌-4, టీఆర్‌ఎస్‌-2, టీడీపీ-1, ఐపీబీ-1, టీజేఎస్‌-1, ఏఐఎ్‌ఫబీ-1, స్వతంత్రులు-6) నామినేషన్లలను ఆయా డివిజన్ల ఆర్వోలకు అందజేశారు. 


శేరిలింగంపల్లి సర్కిల్‌లో 30 నామినేషన్లు ..


గచ్చిబౌలి: శేరిలింగంపల్లి సర్కిల్‌ పరిధిలోని మూడు డివిజన్లలో మొత్తం 30మంది తమ నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలి డివిజన్ల నుంచి టీడీపీ నుంచి ఒకొక్కరు నామినేషన్లు వేశారు. కొండాపూర్‌ నుంచి శేరిలింగంపల్లి సీపీఐ కార్యదర్శి కనకమామిడి శ్రీశైలంగౌడ్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఎంఐఎం అభ్యర్థి కూడా నామినేషన్‌ వేశారు. మూడు డివిజన్ల నుంచి ఐదుగురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. శేరిలింగంపల్లి నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి ఒకరు, గచ్చిబౌలిలో ఇద్దరు నామినేషన్లు దాఖలు చేశారు. గచ్చిబౌలి నుంచిబీజేపీ నుంచి అత్యధికంగా పదిమంది నామినేషన్లు వేశారు. కొండాపూర్‌ నుంచి ముగ్గురు, శేరిలింగంపల్లి నుంచినలుగురు బీజేపీకి చెందిన వారు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అధిష్ఠానం ఇంకా టికెట్లు కేటాయించలేదు. ఈ మూడు డివిజన్ల నుంచి అధికార పార్టీ టీఆర్‌ఎ్‌సకు రెబల్స్‌ బెడద తప్పడం లేదు. శేరిలింగంపల్లి నుంచి రవియాదవ్‌, కొండాపూర్‌ నుంచి రవీందర్‌ముదిరాజ్‌, గచ్చిబౌలి నుంచిగణే్‌షముదిరాజ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో బరిలో ఉండి సత్తాచాటుతామని ధీమా వ్యక్తం చేశారు. 


చందానగర్‌ సర్కిల్‌ పరిధిలో 50 నామినేషన్లు 


చందానగర్‌: చందానగర్‌ సర్కిల్‌-21లో వివిధ పార్టీలకు చెందిన 50మంది అభ్యర్థులు 76సెట్లు దాఖలు చేశారు. మాదాపూర్‌(107) డివిజన్‌ నుంచి చివరి రోజు 10మంది 16నామినేషన్లు వేశారు. మియాపూర్‌ (108) డివిజన్‌ నుంచి 16మంది అభ్యర్థులు 22సెట్లను, హఫీజ్‌పేట(107) డివిజన్‌కు 11మంది అభ్యర్థులు 18సెట్లను దాఖలు చేశారు. చందానగర్‌(110) డివిజన్‌లో 13మంది నామినేషన్లు వేశారు. చందానగర్‌ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి మంజుల రఘునాథ్‌రెడ్డి నామినేషన్‌ వేయగా మాజీ కార్పొరేటర్‌ నవతారెడ్డి, మాజీ కౌన్సిలర్‌ సునీతారెడ్డి టీఆర్‌ఎస్‌ రెబల్‌గా నామినేషన్లు వేశారు. మిర్యాల యామిని కూడా టీఆర్‌ఎస్‌ తరఫున నామినేషన్‌ వేశారు. బీజేపీ నుంచి పోరెడ్డి సబితారెడ్డి, కసిరెడ్డి సింఽధుతో పాటు మరో ఇద్దరు నామినేషన్లు వేశారు. జిల్లా మౌనిక  టీడీపీ నుంచి నామినేషన్‌ వేశారు. హఫీజ్‌పేట డివిజన్‌ నుంచి  టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ కార్పొరేటర్‌ పూజితజగదీశ్వర్‌గౌడ్‌, మియాపూర్‌ డివిజన్‌ నుంచి ఉప్పలపాటి శ్రీకాంత్‌, మాదాపూర్‌ డివిజన్‌ నుంచి జగదీశ్వర్‌గౌడ్‌ నామినేషన్లు వేశారు. మియాపూర్‌ డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా కలివేముల మనోహర్‌, హఫీజ్‌పేట డివిజన్‌ టీడీపీ అభ్యర్థిగా కుర్ర ధనలక్ష్మి, మాదాపూర్‌ నుంచి తన్నీర్‌ ప్రసాద్‌ నామినేషన్లు వేశారు. 


కూకట్‌పల్లిలో 250 నామినేషన్లు...


కూకట్‌పల్లి: కూకట్‌పల్లి, మూసాపేట సర్కిళ్ల పరిధిలో 11 డివిజన్లకు సంబంధించి శుక్రవారం నాటికి 250 నామినేషన్‌ పత్రాలు దాఖలయ్యాయని అధికారులు తెలిపారు. కూకట్‌పల్లి సర్కిల్‌ నుంచి మొత్తం 146 దరఖాస్తులు రాగా... వాటిలో బీజేపీ తరఫున 41, టీఆర్‌ఎస్‌ 31, కాంగ్రెస్‌ 16, టీడీపీ 12, సీపీఎం 1తో పాటు ఇండిపెండెంట్లను కలుపుకొని 146 అందాయి. మూసాపేట సర్కిల్‌ పరిధిలోని 5 డివిజన్లకు గాను 104 దరఖాస్తులు రాగా... వాటిలో బీజేపీ 23, టీఆర్‌ఎస్‌ 18, కాంగ్రెస్‌ 14, ఇండిపెండెంట్స్‌ 19, ఇతరులతో కలిపి 104 దాఖలయ్యాయి.


కూకట్‌పలి/అల్లాపూర్‌/ హైదర్‌నగర్‌: కూకట్‌పల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పవన్‌, టీడీపీ అభ్యర్థిగా దండమూడి సామ్రాజ్యం, కేపీహెచ్‌బీ నుంచి బీజేపీ అభ్యర్థిగా ప్రీతమ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అల్లాపూర్‌లో డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా కౌసర్‌ బేగం, బీజేపీ అభ్యర్థిగా పులిగోళ్ల శ్రీలక్ష్మి నామినేషన్‌ వేశారు. హైదర్‌నగర్‌ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నార్నె శ్రీనివాసరావు నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులతో కలిసి ర్యాలీగా వెళ్లి ఎన్నికల అధికారికి నామినేషన్‌ పత్రాలను దాఖలు చేశారు.


పటాన్‌చెరు డివిజన్‌కు 31నామినేషన్లు...


పటాన్‌చెరు:  పటాన్‌చెరు డివిజన్‌ నుంచి 21మంది అభ్యర్థులు 31నామినేషన్లు దాఖలు చేశారు. రామచంద్రాపురం డివిజన్‌కు 11మంది 13నామినేషన్లు, భారతీనగర్‌ డివిజన్‌కు 9మంది 15నామినేషన్లు దాఖలు చేశారు. టీఆర్‌ఎస్‌ నుంచి పటాన్‌చెరు డివిజన్‌కు మెట్టుకుమార్‌ యాదవ్‌, రామచంద్రాపురం డివిజన్‌కు పుష్పనగేష్‌ యాదవ్‌, భారతీనగర్‌ డివిజన్‌కు సింధుఆదర్శరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. ఎమ్మెల్యేలు మహిపాల్‌రెడ్డి, ఆంధోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, నాయకులు దేవేందర్‌రాజు, తొంటఅంజయ్య అభ్యర్థుల వెంట పాదయాత్రగా  పటాన్‌చెరు జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి వెళ్లి నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. బీజేపీ నుంచి పటాన్‌చెరు అభ్యర్థిగా ఆశి్‌షగౌడ్‌  నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌, పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి నాయకులు  ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి రాజబోయిన కుమార్‌ యాదవ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థిగా జనంపల్లికమల్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. రామచంద్రాపురం బీజేపీ అభ్యర్థిగా సత్యనారాయణ, కాంగ్రెస్‌ అభ్యర్థిగా మవీన్‌గౌడ్‌ నామినేషన్లు దాఖలు చేశారు. భారతీనగర్‌ బీజేపీ అభ్యర్థిగా గోదావరి అంజిరెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. 

 

జీడిమెట్ల/గాజులరామారం/పేట్‌బషీరాబాద్‌/షాపూర్‌ నగర్‌: టీఆర్‌ఎస్‌ జీడిమెట్ల డివిజన్‌ అభ్యర్థిగా కూన పద్మ ప్రతా్‌పగౌడ్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద్‌, జీవన్‌రెడ్డి, యువ నాయకుడు కేపీ. విశాల్‌తో కలిసి  ఆమె నామినేషన్‌ దాఖలు చేశారు. గాజులరామారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రావుల శేషగిరి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. ఈ కార్యక్రమంలో గాజులరామారం ఎన్నికల ఇంచార్జ్‌ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యే శంభీపూర్‌రాజు, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్‌, మాజీ ఎమ్మెల్యే అరికెల నర్సిరెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ జీడిమెట్ల అభ్యర్థి బండి లలిత శ్రీనివా్‌సగౌడ్‌ శుక్రవారం  అనుచరులు కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ దాఖలు చేశారు. రంగారెడ్డి నగర్‌ డివిజన్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి గరిగే శేఖర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. సూరారం డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మంత్రి సత్యనారాయణ, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బట్ట వెంకటేష్‌, బీజేపీ అభ్యర్థి బక్క శంకర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. సూరారం కట్టమైసమ్మ దేవాలయం వద్ద పూజలు నిర్వహించి ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు.

Updated Date - 2020-11-21T18:46:26+05:30 IST