Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమలాపురం కిమ్స్ హాస్పిటల్ లో ఘోరం

తూర్పుగోదావరి జిల్లా: జిల్లాలోని అమలాపురం కిమ్స్ హాస్పిటల్‌లో ఘోరం జరిగింది. దీంతో కిమ్స్ కోవిడ్ హాస్పిటల్ వద్ద ఆందోళన నెలకొంది. ఆసుపత్రిలో కోవిడ్‌తో ఓ వ్యక్తి చేరాడు. అయితే ఆ వ్యక్తి పరిస్థితి విషమించి మృతి చెందాడు. కాగా ఆసుపత్రి సిబ్బంది ఒక మృతదేహానికి బదులు మరో మృత‌దేహాన్ని ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఒక వర్గం ఆ మృతదేహానికి దహన సంస్కారాలు నిర్వహించింది. తమ మృతదేహం తమకు కావాలంటూ మరో వర్గం కిమ్స్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేసింది. దీంతో కిమ్స్ హాస్పిటల్‌ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కిమ్స్ హాస్పిటల్‌లో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగినట్లు సమాచారం. 

Advertisement
Advertisement