కొనుగోలుదారులపైనే గిఫ్ట్‌ వోచర్ల పన్ను భారం

ABN , First Publish Date - 2021-04-05T06:02:23+05:30 IST

ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్లపై జీఎ్‌సటీ పన్ను భారంపై స్పష్టత వచ్చింది. వీటితో వస్తు సేవలు కొనేవారిపైనే ఆ భారం పడుతుందని అప్పిలేట్‌ అఽథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఏఆర్‌) తమిళనాడు విభాగం స్పష్టం చేసింది. అంటే ఇక గిఫ్ట్‌ ఓచర్లతో ఏదైనా వస్తు సేవలు కొంటే వాటిపై ఎంత జీఎ్‌సటీ రేటు ఉంటే అంత

కొనుగోలుదారులపైనే గిఫ్ట్‌ వోచర్ల పన్ను భారం

న్యూఢిల్లీ: ప్రీపెయిడ్‌ గిఫ్ట్‌ వోచర్లపై జీఎ్‌సటీ పన్ను భారంపై స్పష్టత వచ్చింది. వీటితో వస్తు సేవలు కొనేవారిపైనే ఆ భారం పడుతుందని అప్పిలేట్‌ అఽథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఏఆర్‌) తమిళనాడు విభాగం స్పష్టం చేసింది. అంటే ఇక గిఫ్ట్‌ ఓచర్లతో ఏదైనా వస్తు సేవలు కొంటే వాటిపై ఎంత జీఎ్‌సటీ రేటు ఉంటే అంత వసూలు చేస్తారు. ఈ వోచర్లు పేపర్‌ ఆధారితమా లేక మాగ్నెటిక్‌ స్ట్రిప్‌ ఆధారితమా? అనే అంశం ఆఽధారంగా వీటిపై 12 లేదా 18 శాతం జీఎ్‌సటీ విధించాలని ఇంతకు ముందు తమిళనాడు రాష్ట్ర అథారిటీ ఫర్‌ అడ్వాన్స్‌ రూలింగ్‌ (ఏఏఆర్‌) తీర్పు చెప్పింది. కల్యాణ్‌ జువెలర్స్‌ సంస్థ దీన్ని ఏఏఏఆర్‌లో సవాల్‌ చేయడంతో ఈ తాజా తీర్పు చెప్పింది. వోచర్లు సరఫరా ఆధారంగా కాకుండా ఆ వోచర్ల రిడంప్షన్‌ ద్వారా వస్తు సేవలు సరఫరా చేయడంపైనే జీఎ్‌సటీ భారం పడుతుందని ఏఏఏఆర్‌ స్పష్టం చేసింది. 

Updated Date - 2021-04-05T06:02:23+05:30 IST