బరువు తగ్గించే అల్లం నీళ్లు

ABN , First Publish Date - 2021-11-09T05:30:00+05:30 IST

అల్లం నీళ్లు శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తాయని జపనీయుల నమ్మకం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన...

బరువు తగ్గించే అల్లం నీళ్లు

అల్లం నీళ్లు శరీరంలోని కొవ్వును వేగంగా కరిగిస్తాయని జపనీయుల నమ్మకం. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కలిగిన జింజెరాల్‌ అల్లంలో ఉంటుంది. కాబట్టి బరువు తగ్గడంతో పాటు పరిపూర్ణ ఆరోగ్యానికి కూడా అల్లం నీళ్లు తోడ్పడతాయి. ఈ నీళ్లను ఎలా తయారు చేయాలంటే...


  1.  కొన్ని పల్చని అల్లం స్లైసులు, నిమ్మ రసం, ఒకటిన్నర లీటర్ల నీళ్లు సిద్ధం చేసుకోవాలి.
  2. నీళ్లను మరిగించి, అల్లం చేర్చి మంట తగ్గించి 15 నిమిషాలు మరిగించాలి.
  3.  ఈ నీళ్లను చల్లార్చి, వడగట్టాలి.
  4.  నిమ్మరసం పిండుకోవాలి. 
  5.  పరగడుపున ఒక గ్లాసు, రాత్రి భోజనానికి ముందు ఒక గ్లాసు అల్లం నీళ్లు తాగాలి.
  6. అల్లం నీళ్లతో జీర్ణసంబంధ కండరాలు ఆరోగ్యం పొందుతాయి. విరోచనాలు, పొట్టలో నొప్పి అదుపులోకి వస్తాయి.
  7.  కండరాల నొప్పులు తగ్గుతాయు.
  8.  అల్లంలోని 6-షోగోల్‌ అనే కాంపౌండ్‌ మెదడుకు రక్షణనిస్తుంది. నాడీ కణాల క్షీణతకు కారణమయ్యే ప్రమాదకర రసాయనాల విడుదల మందగిస్తుంది. 
  9.  తలనొప్పి, ఉదయాన్నే వాంతులు తగ్గుతాయి. 
  10. యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు కలిగిన అల్లం నీళ్లతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Updated Date - 2021-11-09T05:30:00+05:30 IST