గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం

ABN , First Publish Date - 2021-10-22T06:26:13+05:30 IST

గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. జి.మాడుగుల మండలం నుర్మతిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణతో కలిసి ప్రారంభించారు.

గిరిజనులకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
కంటి వైద్య పరీక్షలను పరిశీలిస్తున్న ఐటీడీఏ పీవో గోపాలక్రిష్ణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి

మెగా వైద్య శిబిరంలో ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి... 


పాడేరు/జి.మాడుగుల, అక్టోబరు 21: గిరిజనులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యమని ఎమ్మెల్యే కొట్టగుళ్లి భాగ్యలక్ష్మి అన్నారు. జి.మాడుగుల మండలం నుర్మతిలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గిరిజనులకు స్పెషలిస్టు వైద్యం అందించాలనే ఆలోచనతోనే ఏజెన్సీ వ్యాప్తంగా మెగా వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామన్నారు. గిరిజనులకు వైద్యం అందించే విషయంలో తమ ప్రభుత్వం ఏమాత్రం రాజీపడదన్నారు. ఐటీడీఏ పీవో రోణంకి గోపాలక్రిష్ణ మాట్లాడుతూ.. ఏజెన్సీలో ప్రతీ 15 రోజులకు ఒక మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి గిరిజనులకు ప్రత్యేక వైద్యం అందిస్తున్నామన్నారు.   ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్‌పర్సన్‌ మత్స్యరాస గాయత్రిదేవి, ఆరోగ్యశ్రీ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ రాజేశ్‌, ఏడీఎంహెచ్‌వో డాక్టర్‌ కె.లీలాప్రసాద్‌, తహసీల్దార్‌ చిరంజీవిపడాల్‌, ఎంపీడీవో కె.వెంకన్నబాబు, ఏటీడబ్ల్యూవో క్రాంతికుమార్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-22T06:26:13+05:30 IST