Viral Video: అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో.. ప్రియుడితో కలిసి ఈ యువతి ఏం చేస్తోందో తెలిసి అవాక్కైన పోలీసులు..!

ABN , First Publish Date - 2021-11-12T04:19:19+05:30 IST

ఓ కేసుకు సంబంధించి ఇండోర్(మధ్యప్రదేశ్) పోలీసులు ఇటీవల విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ కాలనీలోని సీసీటీవీ ఫుటేజీని చూడగా.. అందులోని దృశ్యాలు పోలీసులనే షేక్ చేశాయి.

Viral Video: అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో.. ప్రియుడితో కలిసి ఈ యువతి ఏం చేస్తోందో తెలిసి అవాక్కైన పోలీసులు..!

ఇంటర్నెట్ డెస్క్: ఓ కేసుకు సంబంధించి మధ్యప్రదేశ్ పోలీసులు ఇటీవల విస్తృత దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో వారు ఓ కాలనీలోని సీసీటీవీ ఫుటేజీని చూడగా.. అందులోని దృశ్యాలు పోలీసులనే షేక్ చేశాయి. ‘అర్థరాత్రి ఆ యువతి ఆమె ప్రియుడు చేస్తున్నది ఇదా’ అని తెలుసుకుని వారు అవాక్కయ్యారు. ప్రస్తుతం వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇందోర్‌కు చెందిన ఆ యువతి ఆమె ప్రియుడు రాత్రిళ్లు చేస్తున్న పనేంటో తెలిస్తే ఎవ్వరైనా షాకైపోవాల్సిందే. ఇండోర్‌లో ఇటీవల వెలుగు చూసిన ఈ ఉదంతం ప్రస్తుతం స్థానికంగా కలకలం రేపుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే..


మోదీ నగర్ కాలనీకి చెందిన రవీ ప్రజాపత్ ఎప్పటిలాగానే ఆదివారం రాత్రి తన యాక్టివా వాహనాన్ని పార్కింగ్ స్థలంలో నిలిపి ఇంట్లోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఆఫీసుకు వెళ్లేందుకు రెడీ అవుతూ అతడు ఓ మారు బయటకు వచ్చి చూస్తే ఊహించని షాక్ తగిలింది. రాత్రి పార్కింగ్ స్థలంలో నిలిపిన వాహనం అక్కడ కనిపించలేదు. దీంతో.. కంగారు పడిపోయిన అతడు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా.. ఆశ్చర్యకరమైన దృశ్యం కనిపించింది. ఓ యువ జంట తన వాహనాన్ని కాజేయడం ఆయన కంటపడింది. అంతేకాదు.. ఆ యువతే ఈ మొత్తం వ్యవహారాన్ని ముందుండి నడిపింది. ఆమె స్వయంగా యాక్టివాను స్టార్ చేసి..తనతో పాటు వచ్చిన యువకుడిని ఎక్కించుకుని వాహనంతో సహా పారిపోయింది. దీంతో.. అవాక్కైన రవి విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. కాగా..ఇటీవల కాలంలో ఓ యువతి వాహనాలు దొంగతనం చేస్తోందన్న ఆరోపణలపై పోలీసులు అప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. అయితే.. తాజా ఉదంతం వారికి కి‘లేడీ’కి సంబంధించి పక్కా ఆధారాలను అందించింది. అయితే..సీసీటీవీ ఫుటేజీని చూసిన పోలీసులు ఆ యువతి ఎంత ముదిరిపోయిందో చూసి ఆశ్చర్యపోయారు.  

Updated Date - 2021-11-12T04:19:19+05:30 IST