Advertisement
Advertisement
Abn logo
Advertisement

28 ఏళ్ల కుర్రాడి మర్మాంగాన్ని కట్ చేసిన 35 ఏళ్ల మహిళ.. సృహలోకి వచ్చాక జరిగింది గ్రహించి ఆమెకు ఫోన్ చేస్తే..

ఇంటర్నెట్ డెస్క్: అతడికి 28ఏళ్లు.. ఆమెకు 35ఏళ్లు. ఇద్దరూ యోగా టీచర్లే. సోషల్ మీడియా ద్వారా ఒకరికొకరు పరిచయం అయ్యారు. తర్వాత ఆ పరిచయం స్నేహంగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా ఓ రోజు రాత్రి 28ఏళ్ల కుర్రాడితోనే ఉన్న ఆ మహిళ.. ఊహించని విధంగా ప్రవర్తించింది. అతడి మర్మాంగాన్ని కత్తితో కట్ చేసింది. స్పృహలోకి వచ్చిన తర్వాత జరిగింది గ్రహించి.. బోరున విలపిస్తూ అతడు ఆమెకు ఫోన్ చేస్తే.. ఆ మహిళ చెప్పింది విని అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. కాగా.. ఇంతకూ ఏం జరిగింది అనే పూర్తి వివరాల్లోకి వెళితే..


రాజస్థాన్‌లోని బికనీర్‌కు చెందిన 28ఏళ్ల కుర్రాడు.. జైపూర్‌లో చదువుకుంటూనే యోగా టీచర్‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడికి 35ఏళ్ల మహిళ సోషల్ మీడియాలో పరిచయం అయింది. ఆమె కూడా యోగా టీచర్ అవడం.. జైపూర్‌లోనే నివసిస్తుండటంతో ఆ పరిచయం కాస్తా స్నేహంగా మారింది. దీంతో ఒకరి ఇంటికి మరొకరు వచ్చి.. సరదాగా కొద్ది సమయం అక్కడే గడిపి వెళ్తూ ఉండేవారు. ఈ క్రమంలోనే నవంబర్ 16న సదరు కుర్రాడికి ఆ మహిళ నుంచి ఫోన్ వచ్చింది. కూరగాయాలు, పాలు తీసుకుని ఇంటికి రమ్మనడంతో.. అతడు ఆమె ఇంటికి వెళ్లాడు. అక్కడే భోజనం చేసిన అతడు.. తిరిగి తన ఇంటికి బయల్దేరాడు. ఈ నేపథ్యంలో ఆ మహిళ కూడా అతడితోపాటే వెళ్లింది. ఇంటికి వెళ్లిన తర్వాత ఆ కుర్రాడికి బాగా నిద్రరావడంతో వెళ్లి తన గదిలో పడుకున్నాడు. 


అనంతరం.. అకస్మాత్తుగా రాత్రి 2 గంటల ప్రాంతంలో నిద్రలోంచి మేలుకున్న అతడు.. తన మర్మాంగాన్ని ఆ మహిళ కట్ చేసిందని గ్రహించి, నొప్పితో బాధపడుతూనే ఆమెకు ఫోన్ చేసి బోరున విలపించాడు. ఈ క్రమంలో.. ఆ మహిళ అతడికి సారీ చెప్పడంతో ఆ కుర్రాడు కంగుతిన్నాడు. అనంతరం ఆమే.. అతడికి ఇంటికి మళ్లీ వెళ్లి నొప్పితో బాధపడుతున్న కుర్రాడిని హాస్పిటల్‌లో చేర్పిండంతో.. వైద్యులు అతడికి శస్త్ర చికిత్స చేశారు. కాగా.. ఈ ఘటన పోలీసుల దృష్టికి వెళ్లడంతో హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అంతేకాకుండా ఆహారపదార్థాల్లో మత్తు పదార్థాలను కలిపి.. అతడు స్పృహ కోల్పోయేలా చేసిందని పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఈ దారుణానికి ఎందుకు పాల్పడిందనే విషయాన్ని మాత్రం పోలీసులు ఇంకా రాబట్టలేదు. Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement