Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఊళ్లోంచి పారిపోయిన ప్రేమ జంటను వెతికి తెచ్చి అరాచకం.. బాలికకు గుండు గీసి.. నిప్పుల కుండను నెత్తిన పెట్టి..

గుజరాత్‌లోని పాటణ్ జిల్లాలోని  హారీజ్ గ్రామానికి చెందిన గ్రామస్తులంతా కలసి ఒక బాలికపై తాలిబన్ తరహా శిక్షలను విధించారు. ముందుగా ఆ బాలిక ముఖానికి నల్లని రంగు పూసి, గుండు కొట్టించారు. ఆ తరువాత ఆమె తలపై నిప్పుల కుండను ఉంచి గ్రామమంతా తిప్పించారు. ఈ 14 ఏళ్ల బాలిక ప్రియునితో పరారయ్యేందుకు ప్రయత్నిస్తున్నదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.  ఈ ఉదంతం నవంబరు 9న జరిగింది. సోషల్ మీడియాలో ఈ ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్ఋగా మారడంతో రంగంలోని దిగిన పోలీసులు ఈ ఘటనలో హస్తమున్నట్లు భావిస్తున్న 35 మందిపై కేసు నమోదు చేశారు.

పోలీసు అధికారి అక్షయ్ రాజ్ ఈ ఉదంతం గురించి మాట్లాడుతూ వాది సమాజానికి చెందిన కొందమంది ఆ బాలిక.. ప్రియునితో వెళ్లిపోయేందుకు ప్రయత్నించిందంటూ ఆమెకు శిక్ష విధించారు. ఆ బాలికకు గుండు చేయించారు. ముఖానికి నల్లరంగుపూసి గ్రామమంతా తిప్పారు. ఈ బాలిక తమ సామాజిక కట్టుబాటుకు వ్యతిరేకంగా నడుచుకున్నదని ఆ సమాజపు పెద్దలు ఆరోపిస్తున్నారు. ఆ బాలిక చేసిన పనికి ప్రక్షాళనగా తాము ఈ విధమైన ప్రక్రియ చేయించామన్నారు. కాగా గ్రామస్తులంతా ఈ పని చేస్తున్నప్పుడు ఆ బాలిక భయంతో కేకలు వేసిన దృశ్యం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఆ బాలిక ప్రియుడిని కూడా గ్రామమంతా తిప్పారు. ఆ తరువాత ఆ బాలిక తల్లిదండ్రులు తమ సామాజిక వర్గానికి చెందిన ఒక యువకునితో ఆమెకు వివాహ నిశ్చితార్థం జరిపించారు. కాగా ఆ బాలిక ప్రియునిపై అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement