Advertisement
Advertisement
Abn logo
Advertisement

అర్ధరాత్రి అయింది.. ఆటోలు కూడా ఉండవని చెప్పగానే ఆ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ బైక్‌ను ఎక్కడమే ఆ యువతి చేసిన పొరపాటయింది.. చివరకు..

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ నగరంలో నర్సింగ్ కోర్సు చదువుకుంటున్న ఒక విద్యార్థిని రాధ (పేరు మార్చబడినది) అక్టోబర్ 15న తన ఫ్రెండ్ కావేరి(పేరు మార్చబడినది) పుట్టినరోజు పార్టీకి వెళ్లింది. అక్కడ అనుకోకుండా ధీరేంద్రను కలిసింది. ధీరేంద్ర ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. రాధకు ధీరేంద్రతో ముందుగానే పరిచయం ఉంది. పార్టీ ముగిసిన తరువాత రాధ ఇంటికి వెళ్లాలని చూస్తుండగా ఆమెకు ఆటో దొరకడంలేదు. అదే సమయంలో అక్కడికి ధీరేంద్ర తన బైక్‌పై వచ్చాడు. రాధను ఇంటి వద్ద వదిలిపెడతానని చెప్పాడు.


ధీరేంద్ర ఎంత చెప్పినా రాధ వినలేదు. తను అతని బైక్‌పై రానని చెప్పింది. కానీ ఒకవైపు ఒంటరిగా అక్కడ నిలబడి ఉండడం మంచిది కాదని.. ధీరేంద్ర పదే పదే చెప్పడం.. మరోవైపు ఆటో దొరకకపోవడంతో ఇష్టం లేకపోయినా రాధ అతనిబైక్‌పై ఎక్కి కూర్చుంది. అదే రాధ చేసిన తప్పు. ఆ తప్పు రాధ పాలిట శాపంగా మారింది.


రాధను ధీరేంద్ర తన ఇంటికి తీసుకొనిపోయాడు. అది చూసిన రాధ భయపడింది. కానీ ధీరేంద్ర కాసేపు తన ఇంట్లోకి రమ్మని తనతో కాస్త మాట్లాడాల్సి ఉందని చెప్పాడు. ఈ సారి రాధ అతని మాట వినలేదు. అప్పటికే రాత్రి బాగా లేటవడంతో రాధ తన ఇంటికి వెళ్లాలని ధీరేంద్రతో చెప్పినా అతను వినలేదు. బలవంతంగా రాధను ఇంట్లోకి లాక్కొనిపోయాడు. ఆమెను ఒక గదిలో బంధించి తన కోరికలను తీర్చమన్నాడు. రాధ చెప్పినట్లు వినకపోవడంతో ఆమెను చితకబాదాడు. ఆ తరువాత ఆమెపై అత్యాచారం చేశాడు.


మరుసటి రోజు మధ్యాహ్నం ధీరేంద్ర ఇంట్లో లేని సమయంలో..  రాధ ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకొని తన ఇంటికి చేరింది. తన తల్లిదండ్రులకు ఏడుస్తూ జరిగినదంతా చెప్పింది. ఆ తరువాత రాధ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌లో ధీరేంద్రపై ఫిర్యాదు చేశారు. పోలీసులు ధీరేంద్రపై కిడ్నాప్, అత్యాచారం నేరాల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ధీరేంద్ర పరారీలో ఉండగా.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండిImage Caption

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement