Abn logo
Sep 18 2021 @ 20:28PM

సంగారెడ్డి జిల్లాలో బాలిక కిడ్నాప్‌

సంగారెడ్డి: జిల్లాలో ఏడేళ్ల బాలికను ఇద్దరు దుండగులు కిడ్నాప్‌ చేసారు. శివ్వంపేట కల్లు దుకాణంలో కల్లు తాగడానికి బాలికను అగంతకులు వెంట తీసుకెళ్లారు. అయితే బాలిక ఏడుస్తుండటంతో అగంతకులను గ్రామస్తులు నిలదీసారు. వినాయక విగ్రహాలను చూపిస్తామంటూ బాలికను నమ్మించి కిడ్నాప్ చేసినట్లు అగంతకులు అంగీకరించారు. కిడ్నాపర్లను పుల్కల్‌ పోలీసులకు  స్థానికులు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption

క్రైమ్ మరిన్ని...