అడవిలో ఉండాల్సిన కొండచిలువ.. అమ్మాయి ఒడిలో.. Viral అవుతున్న Video.!

ABN , First Publish Date - 2021-10-02T00:16:49+05:30 IST

కొండచిలువలు సాధారణంగా అడవుల్లో ఉంటాయి. ఒక్కోసారి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి పశువులను, మనుషులను మింగుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే ఓ కొండచిలువ మాత్రం వాటికి భిన్నంగా ఉన్నట్టుంది. సాధు జంతువులను

అడవిలో ఉండాల్సిన కొండచిలువ.. అమ్మాయి ఒడిలో.. Viral అవుతున్న Video.!

కొండచిలువలు సాధారణంగా అడవుల్లో ఉంటాయి. ఒక్కోసారి సమీపంలోని గ్రామాల్లోకి వచ్చి పశువులను, మనుషులను మింగుతూ ఉండడం చూస్తూనే ఉంటాం. అయితే ఓ కొండచిలువ మాత్రం వాటికి భిన్నంగా ఉన్నట్టుంది. సాధు జంతువులను చూసుంటాం.. కానీ ఇది మాత్రం సాధు కొండచిలువ మాదిరిగా ఉంది. ఏంటి షాక్ అవుతున్నారా.. ఈ వీడియో చూసిన వారు ఎవరైనా షాక్ అవ్వకుండా ఉండలేరు. 


పాములు, కొండచిలువలను చూస్తేనే ఒళ్లంతా కంపనంగా ఉంటుంది. అలాంటిది తాకాలంటే ఇంకేలా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. కలలో కూడా ఆ పని చేయరు కదా. కానీ ఓ యువతి మాత్రం ఏకంగా కొండచిలువతోనే స్నేహం చేస్తోంది. అంతటితో ఆగకుండా ఏకంగా ఒడిలో పెట్టుకుని మరీ పెంచుతోంది. ఓ వైపు సెల్‌ఫోన్‌ చూసుకుంటూ బిజీగా ఉన్న యువతి, మరోవైపు తనకు కూడా చూపించమంటూ కొండచిలువ.. ఆమె ఒడిలోకి చేరుతున్నట్లుగా ఆ వీడియో ఉంది. దీన్ని చూసి అంతా షాక్‌కు గురవుతున్నారు.


సెప్టెంబర్ 18న సోషల్ మీడియాలో పోస్టు చేసిన ఈ వీడియో వైరల్ అయింది. ఇప్పటివరకు 1.3 మిలియన్ మంది ఈ వీడియోను వీక్షించారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగిందంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో చూసిన వారంతా వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ఆ యువతి.. మాంసాహారం బదులుగా పాములు తినే అలవాటు ఉందేమో అంటూ హేలన చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలని మరికొందరు సూచిస్తున్నారు. ఇది నిజమైన వీడియోనో, లేక గ్రాఫిక్సో తెలీదు గానీ.. నెట్టింట్లో మాత్రం తెగ హల్‌చల్ చేస్తోంది.



Updated Date - 2021-10-02T00:16:49+05:30 IST