Abn logo
Oct 23 2021 @ 11:32AM

Kolkataలో బాలిక మిస్సింగ్‌.. హైదరాబాద్‌లో గుర్తించి కాపాడారు!

హైదరాబాద్‌ : కోల్‌కతాలో కనిపించకుండాపోయిన ఓ బాలికను మహిళా భద్రతా విభాగం అధికారులు హైదరాబాద్‌లో గుర్తించి రక్షించారు.  కోల్‌కతాకు చెందిన సంతు పరమానిక్‌ స్థానికంగా ఉండే బాలికకు మాయమాటలు చెప్పి జూన్‌లో హైదరాబాద్‌కు తరలించాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కోల్‌కతా పోలీసులు మానవ అక్రమ రవాణా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చైల్డ్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా కోల్‌కతాలో మిస్సైన బాలిక హైదరాబాద్‌లో ఉన్నట్లు తేలింది. మహిళా భద్రత విభాగం ప్రత్యేక బృందం చిక్కడపల్లిలో ఉన్న బాలికను రక్షించి సఖీ సెంటర్‌కు తరలించారు. నిందితుడు పరమానిక్‌ను అదుపులోకి తీసుకుని పశ్చిమ బెంగాల్‌ మానవ అక్రమ రవాణా నిరోధక బృందానికి అప్పగించారు. సీడీఆర్‌, సాంకేతిక ఆధారాలతో నిందితుడ్ని పట్టుకున్నామని మహిళా భద్రత విభాగం చీఫ్‌ స్వాతి లక్రా తెలిపారు.

ఇవి కూడా చదవండిImage Caption

హైదరాబాద్మరిన్ని...