అతడిని నా భర్తగా అంగీకరించలేను.. పెళ్లిని రద్దు చేయండి.. నాలుగేళ్లుగా ఓ యువతి పోరాటం.. అసలు కథేంటంటే..

ABN , First Publish Date - 2021-11-11T11:12:23+05:30 IST

బాల్య వివాహాలు చట్ట విరుద్ధమైనప్పటికీ మన దేశంలో పలు చోట్ల ఇంకా ఆ దురాచారం బ్రతికే ఉంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో బాల్యంలోనే వివాహాలు చేయడం మంచిదని ఇంకా కొందరు నమ్ముతున్నారు. కానీ అలా చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతోందో?.. ఆ పసిపిల్లలు తమ హక్కులు ఎలా కోల్పోతున్నారో? తెలియజేయడానికే ఒక యువతి కథే నిదర్శనం...

అతడిని నా భర్తగా అంగీకరించలేను.. పెళ్లిని రద్దు చేయండి.. నాలుగేళ్లుగా ఓ యువతి పోరాటం.. అసలు కథేంటంటే..

బాల్య వివాహాలు చట్ట విరుద్ధమైనప్పటికీ మన దేశంలో పలు చోట్ల ఇంకా ఆ దురాచారం బ్రతికే ఉంది. ముఖ్యంగా ఉత్తర భారత దేశంలోని కొన్ని రాష్ట్రాలలో బాల్యంలోనే వివాహాలు చేయడం మంచిదని ఇంకా కొందరు నమ్ముతున్నారు. కానీ అలా చేయడం వల్ల ఎంత నష్టం జరుగుతోందో?.. ఆ పసిపిల్లలు తమ హక్కులు ఎలా కోల్పోతున్నారో? తెలియజేయడానికే ఒక యువతి కథే నిదర్శనం. ఆమె తన హక్కుల కోసం న్యాయపరంగా పోరాడింది. తన చుట్టూ ఉన్న సమాజాన్ని వేలెత్తి చూపింది. న్యాయస్థానం నుంచి తనకు న్యాయం అందేవరకు ఆమె విశ్రమించలేదు. 


రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపూర్‌కు చెందిన మంజు అనే యువతికి 2012లో బాల్యవివాహం జరిగింది. అప్పుడు ఆమె వయసు 12 సంవత్సరాలు. ఆమెను పెళ్లిచేసుకున్న వ్యక్తి తన కంటే 8 సంవత్సరాలు పెద్దవాడు. మంజుకు బాగా చదువుకోవాలని ఆశ. కానీ 2016లో ఆమెను తనతో పంపించమని ఆమె భర్త ఒత్తిడి చేశాడు. ఆమె అత్త కూడా ఇక మంజు చదువును నిలిపివేయమని అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పింది. ఈ మాటలు విన్న మంజు తన చదువు ఎక్కడ ఆగిపోతుందోనని భయపడింది. తాను భర్త ఇంటికి వెళ్లనని, చదువుకుంటానని తల్లిదండ్రులతో చెప్పింది. దీనికి మంజు తల్లి ఆమెకు బాసటగా నిలిచింది. 


మంజును తన భర్త ఇంటికి పంపించేది లేదని, అసలు మంజుకు ఈ పెళ్లే ఇష్టం లేదని ఆమె తల్లి అందరికీ స్పష్టం చేసింది. దీంతో గొడవలు మొదలయ్యాయి. కుటుంబ గొడవలు ఊరి పంచాయితీ వరకు వెళ్లాయి. పెళ్లకి ఎంతో ప్రాధాన్యం ఇచ్చే ఊరి పెద్దలు మంజుకు వ్యతిరేకంగా చెప్పారు. దీంతో 2017లో మంజు కోర్టును ఆశ్రయించింది. తాను ఒక మైనర్‌ని అని, పెళ్లి జరిగే సమయంలో తనకు అసలు పూర్తిగా స్పృహ లేదని. ఏం జరిగిందో అప్పుడు అర్థం కాలేదని కోర్టులో మంజు వాదించింది. తనకు జరిగిన బాల్యవివహాన్ని రద్దు చేసి చదువుకునే అధికారాన్ని కల్పించమని కోర్టును మంజును కోరింది. ఈ కేసు కోర్టులో నాలుగు సంవత్సరాలు జరిగింది. ఇటీవలే ఈ కేసులో తీర్పును వెలువరించింది.


మంజుకు జరిగిన బాల్య వివాహం చెల్లుబాటు కాదని, ఆమె తనకు నచ్చిన వ్యక్తితో మళ్లీ వివాహం చేసుకోవచ్చని కోర్టు చెప్పింది. చదువుకునే అధికారం ప్రతి ఒక్కరికీ ఉంటుందని చెబతూ ఆమెకు జరిగిన వివాహాన్ని రద్దుచేస్తూ తీర్పునిచ్చింది. అలా మంజు తాను చదువుకునేందుకు నాలుగేళ్లు న్యాయ పోరాటం చేసి తన హక్కును సాధించింది.


Updated Date - 2021-11-11T11:12:23+05:30 IST