ఉద్యోగం కోసం హోటల్‌కు వెళ్లిన అమ్మాయి.. పోలీసులు వచ్చేసరికి దారుణం

ABN , First Publish Date - 2021-11-14T05:27:42+05:30 IST

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై హింస, అత్యాచార కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే అక్కడ మహిళలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు సైతం సతమతమవుతున్నారు. తాజాగా ఒక హోటల్‌లో జరిగిన ఒక ఘటన నగరంలో కలకలం రేపింది...

ఉద్యోగం కోసం హోటల్‌కు వెళ్లిన అమ్మాయి.. పోలీసులు వచ్చేసరికి దారుణం

దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై హింస, అత్యాచార కేసులు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే అక్కడ మహిళలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు అక్కడి పోలీసులు సైతం సతమతమవుతున్నారు. తాజాగా ఒక హోటల్‌లో జరిగిన ఒక ఘటన నగరంలో కలకలం రేపింది. ఢిల్లీలోని ద్వారకా సౌత్‌ ప్రాంతంలోని ఓ హోటల్‌లో ఈ ఘటన జరిగింది. 


ఢిల్లీలోని  ద్వారకా ప్రాంతంలో స్వప్న(25, పేరు మార్చబడినది) తన కుటుంబంతో ఉంటోంది. ఆమె ఒక సేల్స్ గర్ల్ ఉద్యోగం చేస్తోంది. ఆ ఉద్యోగంతో సరైన సంపాదన లేకపోవడంతో ఏదైనా పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. ఇదే తరుణంలో ఆమెకు అంకిత్ అనే యువకుడు పరిచయమయ్యాడు. స్వప్న పరిస్థితిని గమనించిన అంకిత్.. ఆమెకు మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ చెప్పాడు. కొన్ని రోజుల తరువాత ఒక ఇంటర్‌వ్యూ కోసం హోటల్‌కు రావాలని ఆమెతో చెప్పాడు.


పెద్ద ఉద్యోగం కోసం ఆశ పడిన స్వప్న అతడితో వెళ్లింది. హోటల్ లోపల వెళ్లగానే స్వప్నకు ఏదో అనుమానం కలిగింది. దీంతో ఆమె అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతానని చెప్పింది. అప్పుడు అంకిత్.. తన తల్లి  ఒక పోలీస్ ఆఫీసర్ అని.. ఆ హోటల్‌లో అందరితో తనకు పరిచయం ఉందని చెప్పి స్వప్నను నమ్మించాడు.


ఆ తరువాత స్వప్నను ఒక గదిలోకి తీసుకెళ్లి కాస్త విస్కీ తీసుకోమన్నాడు. అప్పుడు స్వప్న తనకు ఇలాంటివి అలవాటు లేవని చెప్పడంతో.. అంకిత్ ఒక్కసారిగా తన నిజస్వరూపం చూపించాడు. హెటల్‌లో పనిచేసే కొందరు అంకిత్‌తో కలిసి స్వప్నను చితకబాదారు. ఆమెను బలవంతంగా విస్కీ తాగించారు. స్వప్నను బట్టలు విప్పమని అంకిత్ బెదిరించాడు. దానికి స్వప్న ఒప్పుకోకపోవడంతో ఆమెను ఒక ఇనుప వస్తువుతో కొట్టాడు. ఆమె ముఖంపై గాట్లు వేశాడు. ఆ తరువాత స్వప్నపై అంకిత్, అతని మిత్రులు(హోటల్ సిబ్బంది) అత్యాచారం చేశారు.  స్వప్న పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమె చనిపోయిందనుకొని భయపడి అంకిత్ అక్కడి నుంచి పారిపోయాడు. వెళ్లేటప్పుడు హోటల్ గదిని బయటి నుంచి లాక్ చేసి వెళ్లాడు.


కాసేపు తరువాత స్వప్న స్పృహలోకి వచ్చింది. ఎవరైనా తనను కాపాడమని గట్టిగా కేకలు వేసింది. ఎవరూ రాలేదు. గదిలోని ఒక చెత్తబుట్టలో తన ఫొన్ దొరకడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసింది. వాట్సాప్‌లో లొకేషన్ షేర్ చేసింది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. స్వప్న ఉన్న గది తలుపులు పగలకొట్టి ఆమెను బయటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం స్వప్న ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఉంది.


స్వప్న చేసిన ఫిర్యాదు ప్రకారం అంకిత్, అతని స్నేహితులపై పోలీసులు అత్యాచారం, హత్యాప్రయత్నం, చీటింట్ కేసులు నమోదు చేశారు. హోటల్ సీసీటీవీ ఆధారంగా అంకిత్‌ని పోలీసులు గుర్తుపట్టారు.  పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


Updated Date - 2021-11-14T05:27:42+05:30 IST