బ్లాక్‌మెయిల్ చేస్తూ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం

ABN , First Publish Date - 2020-09-15T21:37:55+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. సాత్నా జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ తెలిపిన దాని ప్రకారం.. బాధితురాలు సెప్టెంబర్ 11వ తేదీన కోల్వగాన్ పోలీసులను ఆశ్రయించి తనపై జరుగుతున్న

బ్లాక్‌మెయిల్ చేస్తూ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం

భోపాల్: మహిళల్ని బ్లాక్‌మెయిల్ చేస్తూ వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్న ఓ వ్యాపారవేత్త(40)ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా 16 ఏళ్ల బాలికను రెండేళ్లుగా బ్లాక్‌మెయిల్ చేస్తూ ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టినట్టు పోలీసులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈమెకు ముందు అతడు ఆరగురు మహిళలతో ఇలాగే వ్యవహరించినట్లు పోలీసులు తెలిపారు.


మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో వెలుగు చూసిందీ ఘటన. సాత్నా జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ తెలిపిన దాని ప్రకారం.. బాధితురాలు సెప్టెంబర్ 11వ తేదీన కోల్వగాన్ పోలీసులను ఆశ్రయించి తనపై జరుగుతున్న అత్యాచార ఉదంతాన్ని వెల్లడించిందని అన్నారు. తనను సమీర్‌గా పరిచయం చేసుకుని, తన బలహీనతలను ఆసరాగా బ్లాక్‌మెయిల్ చేస్తూ రెండేళ్లుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితురాలు పేర్కొంది.


‘‘సమీర్ అలియాస్ అతీక్.. రెండు పేర్లతో పాటు రెండు పాస్‌పోర్టులు కూడా ఉన్నాయి. 2017లో మతాంతర వివాహం చేసుకున్నాడు. అయితే కొద్ది రోజులకే విడాకులు తీసుకున్నాడు. అనంతరం ఆడవారితో సంబంధాలు ఏర్పరుచుకుంటూ వారిని బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. బ్లాక్‌మెయిల్ చేస్తూ వారి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుంటున్నాడు’’ అని ఎస్పీ రియాజ్ తెలిపారు.

Updated Date - 2020-09-15T21:37:55+05:30 IST