బాలికను లైంగికంగా వేధించి..వీడియో పోస్టు చేసి...

ABN , First Publish Date - 2021-02-23T17:56:36+05:30 IST

ఓ యువకుడితో కలిసి వచ్చిన పాఠశాల బాలికను కొందరు యువకులు పట్టుకొని లైంగికంగా వేధించి...

బాలికను లైంగికంగా వేధించి..వీడియో పోస్టు చేసి...

గయా (బీహార్): ఓ యువకుడితో కలిసి వచ్చిన పాఠశాల బాలికను కొందరు యువకులు పట్టుకొని లైంగికంగా వేధించి, దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన దారుణ ఘటన బీహార్ రాష్ట్రంలోని గయా జిల్లాలో వెలుగుచూసింది. గయా జిల్లాకు చెందిన పాఠశాల బాలిక తన బాయ్ ఫ్రెండుతో కలిసి ఉండటం చూసిన యువకులు తాము సంఘ సంస్కర్తలమని చెప్పి బాలిక జుట్టు పట్టుకొని లైంగికంగా వేధించారు.యువకులు బాలికను కొడుతూ, తాకరాని చోట్ల తాకుతూ లైంగికంగా వేధించారు. యువతి తప్పించుకునేందుకు యత్నించగా, ఆమె బాయ్ ఫ్రెండును పట్టుకొని చంపేస్తామని బెదిరించారు. అనంతరం యువకులు బాలికను లైంగికంగా వేధించారు. ఈ ఘటనను వారే వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దీంతో తాము కేసు నమోదు చేసి బాలికను వేధించిన యువకులను గుర్తించేందుకు యత్నిస్తున్నామని ఎస్పీ ఆదిత్యకుమార్ చెప్పారు. 

Updated Date - 2021-02-23T17:56:36+05:30 IST