Advertisement
Advertisement
Abn logo
Advertisement

అద్దె గదిలో ప్రియుడితో సహజీవనం.. ఏడాది తర్వాత అసలు నిజం బయటపెట్టి భారీ షాకిచ్చిన ప్రేయసి..

ఇంటర్నెట్ డెస్క్: ఔను.. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు కూడా. ఇంటి అద్దె, కరెంటు, వాటర్ బిల్లు గట్రా అన్నీ అతనే కడుతున్నాడు. ఇలా ఇప్పటికే ఏడాది గడిచింది. ఇప్పుడు తాజాగా చేసిన ఒక టిక్‌టాక్ వీడియోలో అసలు నిజం బయటపెట్టిందా ప్రియురాలు. అంతే ఆ వీడియో చూసిన నెటిజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. ఆమె చేసిన పని సరైందా? కాదా? అని వాదించుకుంటున్నారు. ఇంతకీ ఆమె చెప్పిన నిజమేంటో తెలుసా? వాళ్లు అద్దెకుంటున్న ఇల్లు ఆమెదే!


ఇది కూడా చదవండి: రాత్రి ఆలస్యంగా వచ్చిన భర్త.. ఇంట్లో అంతా చీకటి.. పిలిచినా పలకని భార్య.. లైట్ వేసి చూస్తే..

ఇది కూడా చదవండి: 44 ఏళ్ల మహిళ అదృశ్యం.. 23 రోజుల తర్వాత పక్కింటి వంటింట్లో తవ్వితే దొరికిన మృతదేహం.. అసలేం జరిగిందంటే..


జేన్ యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఏడాదిగా ఒక అద్దె ఇంట్లో ఉంటోంది. వీళ్లిద్దరికీ ఒకరంటే ఒకిరికి చాలా ప్రేమట. అయితే ఇటీవల ఒక టిక్‌టాక్ వీడియోలో ఆమె చెప్పిన మాట విన్న తర్వాత ఆ బాయ్‌ఫ్రెండ్ ఏం చేస్తాడో అని నెటిజన్లు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. తాను బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఏడాదిగా ఒక ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు వెల్లడించింది. ఇంటి అద్దె, ముఖ్యమైన బిల్లులన్నీ అతనే కడుతున్నాడని చెప్పింది. అయితే ఆ ఇంటి యజమానురాలు తానేనని, ఆ విషయం ఇంకా తన బాయ్‌ఫ్రెండ్‌కు తెలియదని అసలు నిజం చెప్పింది. ఈ విషయం తెలిశాక అతను కోప్పడతాడంటారా? అంటూ నెటిజన్లను ప్రశ్నించింది. దీనిపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోయింది. ఆమె చేసిన పని పెద్ద తప్పేమీ కాదని కొందరు వాదిస్తుంటే.. బాయ్‌ఫ్రెండ్‌ను ఇలా మోసం చేయడం సరికాదని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి అసలు ఆ బాయ్‌ఫ్రెండ్ ఏమంటాడో మరి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement