Advertisement
Advertisement
Abn logo
Advertisement

పెళ్లి వేడుకలో షాకింగ్ సీన్.. ఫంక్షన్ హాల్ బయట ఉండి కేకలు వేస్తున్న యువతి.. ఎవరా అని ఆరా తీస్తే..

కల్యాణమండపంలో అంగరంగ వైభవంగా పెళ్లి జరుగుతోంది.. లోపలకి వెళ్లేందుకు ఓ యువతి ప్రయత్నించింది.. అయితే సెక్యూరిటీ గార్డులు ఆమెను వెళ్లనివ్వలేదు.. దీంతో ఆ యువతి ఆ మండపం బయట నుంచే కేకలు వేయడం ప్రారంభించింది.. ఆ యువతి ఎవరా అని ఆరా తీస్తే పెళ్లి పీటల మీద కూర్చున్న వరుడి ప్రేమికురాలని తేలింది.. అతడితో కలిసి మూడేళ్లు సహజీవనం చేసినట్టు చెప్పింది.. పోలీసులు రంగప్రవేశం చేసినా ఫలితం లేకపోయింది.. మధ్యప్రదేశ్‌లోని హోసంగాబాద్‌లో ఈ ఘటన జరిగింది. 


హోసంగాబాద్ సిటీలోని ఓ కల్యాణమండపం వెలుపల గురువారం ఓ యువతి హల్‌చల్ చేస్తుండడం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో మహిళా ఎస్సై శ్రద్ధా రాజ్‌పుత్ అక్కడకు చేరుకుని ఆమెను వివరాలడిగారు. ప్రస్తుతం పెళ్లి చేసుకుంటున్న వరుడు తన ప్రేమికుడని, తనతో కలిసి మూడేళ్లు సహజీవనం చేశాడని, ఇప్పుడు రహస్యంగా పెళ్లి చేసుకుంటున్నాడని చెప్పింది. దీంతో అతనిపై కేసు పెడితే చర్యలు తీసుకుంటామని సదరు యువతికి ఎస్సై చెప్పారు.


అందుకు ఆ యువతి నిరాకరించింది. అతడిపై కంప్లైంట్ ఇవ్వనని స్పష్టం చేసింది. వెంటనే తనతోపాటు వచ్చిన వారితో కలిసి భోపాల్ వెళ్లిపోయింది. కాన్పూర్‌కు చెందిన ఆ యువతి ఉద్యోగ నిమిత్తం భోపాల్‌లో ఉంటోంది. పెళ్లి చేసుకుంటున్న యువకుడు కూడా భోపాల్‌లో ఈమె పనిచేసే సంస్థలోనే ఉద్యోగం చేసేవాడు. మూడేళ్ల పాటు ఇద్దరూ ఒకే ఇంట్లో భార్యాభర్తల్లా కలిసి జీవించారు. గత బుధవారం ఆమెకు తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసేసుకున్నాడు. అతడిపై ఫిర్యాదు చేస్తే తన ఇంట్లో వాళ్లకు ఇబ్బందులు వస్తాయని సదరు యువతి కంప్లైంట్ ఇవ్వలేదని సమాచారం. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement