మండల పదవులైనా ఇవ్వండి!

ABN , First Publish Date - 2021-04-12T04:56:20+05:30 IST

‘ఎమ్మెల్సీ, లేకపోతే రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి, మీ సీనియార్టీకి తగినట్టు సముచిత స్థానం కల్పిస్తాం.’..ఇలా ఎన్నికల ముందు కొందరు నాయకులకు అధికార పార్టీ నేతలు ఆఫర్‌ చేశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారికి ఎటువంటి

మండల పదవులైనా ఇవ్వండి!





దయనీయ స్థితిలో నియోజకవర్గ నేతలు

 (శృంగవరపుకోట)

‘ఎమ్మెల్సీ, లేకపోతే రాష్ట్రస్థాయి నామినేటెడ్‌ పదవి, మీ సీనియార్టీకి తగినట్టు సముచిత స్థానం కల్పిస్తాం.’..ఇలా ఎన్నికల ముందు కొందరు నాయకులకు అధికార పార్టీ నేతలు ఆఫర్‌ చేశారు. కానీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా వారికి ఎటువంటి పదవులు దక్కలేదు. ప్రస్తుత పరిషత్‌ ఎన్నికల్లో కనీసం మండలస్థాయి పదవులైనా తమకు ఇప్పించాలని వారంతా కోరుతున్నారు. రిజర్వేషన్‌ అడ్డంకిగా ఉన్నచోట తమ సిఫారసులకు పెద్దపీట వేయాలని అభ్యర్థిస్తున్నారు. ఎస్‌.కోట నియోజకవర్గంలో ఇటువంటి నేతల జాబితా చాంతాడంత ఉంది. ఇక్కడ నియోజకవర్గ స్థాయి నేతలు అధికం. వైసీపీ ఆవిర్భావం నుంచి నియోజకవర్గ బాధ్యతలు చూసిన వారున్నారు. మొన్నటి సాధారణ ఎన్నికల్లో ముగ్గురు, నలుగురు నాయకులు ఎమ్మెల్యే టిక్కెట్‌ ఆశించారు. కానీ అనూహ్యంగా కడుబండి శ్రీనివాసరావు తెరపైకి వచ్చి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఆ ముగ్గురు నాయకులకు ఎమ్మెల్సీ, రాష్ట్రస్థాయి పదవులను ఆఫర్‌ చేశారు. దీంతో వారు పార్టీ అభ్యర్థి గెలుపునకు కృషిచేశారు. కానీ అందులో ఒక్కరికే రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ పదవి కట్టబెట్టారు. మిగతా వారికి మాత్రం మొండి చేయి చూపారు. పార్టీలో తగినంత గుర్తింపు లేదని వారు వాపోతున్నారు. అందులో ఒకరు వేపాడ ఎంపీపీ అభ్యర్థిత్వాని ఆశిస్తున్నారు. కానీ పార్టీలో ఆయన వైరి వర్గం అడ్డుకుంటోంది.  ఎస్‌.కోట మండలానికి చెందిన ఓ నాయకుడు పరిస్థితి మరీ విచిత్రం. మండలస్థాయి పదవి చేపట్టడానికి రిజర్వేషన్‌ అడ్డంకిగా నిలిచింది. దీంతో తన అనుచరులకైనా ఎంపీపీ ఇప్పించాలని ఆయన కోరుతున్నారు. ఆయన భార్యకు వైస్‌ ఎంపీపీ ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు. కానీ ఆయన వైరి వర్గం అడ్డుకునే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఎన్నో ఆశలతో పార్టీలో చేరిన వారు మండలస్థాయి పదవులు దక్కించుకోవడానికి సైతం ఆపసోపాలు పడుతున్నారు. 


111111111111111111111111111111111111111111111111111

Updated Date - 2021-04-12T04:56:20+05:30 IST