Advertisement
Advertisement
Abn logo
Advertisement

గంగిరెడ్డిని.. కస్టడీకి ఇవ్వండి: సీబీఐ

కడప : వివేకా హత్య కేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురువారం కోర్టును కోరారు. ఈ కేసులో సీబీఐ అధికారులు 101వ రోజు విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడు ఉమాశంకర్ రెడ్డిని నాలుగు రోజుల పాటు సీబీఐ కస్టడీకి.. పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో గురువారం మధ్యాహ్నం 3 గంటల నుంచి 20వ తేదీ మధ్యాహ్నం 3వరకూ ఉమాశంకర్ రెడ్డిని కస్టడీలోకి తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఉమాశంకర్ రెడ్డికి వైద్య పరీక్షలు చేయించాలని కోర్టు ఆదేశించింది. వివేక ప్రధాన అనుచరుడు ఎర్ర గంగిరెడ్డి బైయిల్ రద్దు చేయాలని పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు పిటిషన్ దాఖలు చేశారు.

ఇవి కూడా చదవండిImage Caption

Advertisement
Advertisement