Advertisement
Advertisement
Abn logo
Advertisement

రైతులకు విరివిగా రుణాలు ఇవ్వండి: కలెక్టర్‌

కర్నూలు(కలెక్టరేట్‌), డిసెంబరు 3: రైతులకు విరివిగా పంట రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు బ్యాంకర్లను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో శుక్రవారం బ్యాంకర్లకు సంబంధించిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం, వ్యవసాయాధారిత రంగాలకు సకాలంలో రుణాలిచ్చి ప్రోత్సహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాకలు రుణాలు వెంటనే ఇవ్వాలని తెలిపారు. పొదుపు మహిళలకు  జీవనోపాధి రుణాలు కూడా సకాలంలో అందేలా చూడాలన్నారు. సెప్టెంబరు 30 నాటికి ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి రూ.5,460 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా, 110.75 శాతం, రబీ సీజన్‌కు సంబంధించి రూ.2,827 కోట్ల పంట రుణం లక్ష్యం కాగా 36.06 శాతం సాధించారని తెలిపారు. టర్మ్‌ లోన్స్‌ సంబంధించి 1,895 కోట్లు కాగా 56.41 శాతం, అగ్రి ఇన్‌ఫ్రాస్టక్చర్‌ 210 కోట్లు కాగా 3.07 శాతం, యాన్సిలరీ యాక్టివిటీస్‌ కింద 136 కోట్లలో 19.34 శాతం, మొత్తం వ్యవసాయానికి సంబంధించి 10,528 కోట్లు కాగా, 67.90 శాతం సాధించారని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ 1,940 కోట్లలో 37.23 శాతం, ఎక్స్‌పోర్ట్‌ క్రెడిట్‌ 4.00 కోట్లలో ఇంత వరకు ఏమీ సాధించలేదన్నారు. అదర్‌ ప్రియారిటీ సెక్టర్‌ 964 కోట్లలో 27.04 శాతం సాధించారని, మొత్తం ప్రియారిటీ సెక్టర్‌ 13436 కోట్లలో 60.52 శాతం సాధించారని కలెక్టర్‌ తెలిపారు. నాన్‌ ప్రియారిటీ సెక్టర్‌ 3,741 కోట్లలో 44.48 శాతం సాధించారని, 2021-22 వార్షిక ప్రణాళిక లక్ష్యం 17,177 కోట్లు కాగా అందులో సెప్టెంబరు 30 నాటికి 57.03 శాతం అచీవ్‌ అయ్యారని తెలిపారు. ఎంఎస్‌ఎంఈ కింద 1,940 కోట్లలో 37.23 శాతం సాధించారని, ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌ కింద బ్యాంకర్లు తమకిచ్చిన లక్ష్యాలను అధిగమించలేదని తెలిపారు. చాలా మంది చిన్న తరహా పరిశ్రమలు నెలకొల్పేందుకు ముందుకు వస్తున్నారని, వారందరినీ ప్రోత్సహించి బ్యాంకు రుణం పొందేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ పరిశ్రమల శాఖ జనరల్‌ మేనేజర్‌ను ఆదేశించారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ ఏంట్రషిప్‌ స్కీమ్‌కు సంబంధించి ఏడు అప్లికేషన్లు బ్యాంకులో పెండింగ్‌లో ఉన్నాయని, వెంటనే క్లియర్‌ చేయాలని ఆదేశించారు. హ్యాండ్లూమ్‌ టెక్స్‌టైల్స్‌ (వీవర్‌ ముద్ర స్కీమ్‌) సంబంధించి 11 బ్యాంకులకు 391 అప్లికేషన్లు పంపించగా 45 వాటికి మాత్రమే లోన్లు మంజూరు చేశారని, మిగిలిన అర్హులైన వారందరికీ రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. స్టాండ్‌ ఆఫ్‌ ఇండియా కింద ఎస్సీ, ఎస్టీల కింద రూ.10లక్షల నుంచి రుణాలు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ సంబంధించిన వారితో చర్చించి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జిల్లాలో ఉన్న 481 బ్రాంచ్‌ల నుంచి రెండు రుణాలు ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. అనంతరం నాబార్డు ఆధ్వర్యంలో 2022-23 పొటెన్షియల్‌ లింక్డ్‌ క్రెడి్‌ ప్లాన్‌ బుక్‌ను కలెక్టర్‌ ఆవిష్కరించారు. జేసీ ఎంకేవీ శ్రీనివాసులు, నాబార్డు డీడీఎం పార్థవ్‌, ఎల్‌డీఎం వెంకటనారాయణ, ఆర్‌బీఐ డిస్ట్రిక్ట్‌ ఆఫీసర్‌ రెహిమాన్‌, కెనరా బ్యాంకు ఏజీఎం సుమలత, జిల్లా స్థాయి అధికారులు బ్యాంకర్లు పాల్గొన్నారు.


సచివాలయాల తనిఖీ 


నగరంలోని ఎస్‌.నాగప్పవీధి వార్డు సచివాలయం, షరాఫ్‌ బజారు వార్డు సచివాలయాన్ని కలెక్టర్‌ పి.కోటేశ్వరరావు శుక్రవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూమెంట్‌ రిజిస్టర్‌, సంక్షేమ పథకాల క్యాలెండర్‌, ఎస్‌ఎల్‌ఏ గడువులోగా ప్రజా సమస్యలు పరిష్కార చర్యల నివేదిక, ప్రభుత్వ పథకాల పోస్టర్ల తదితర వాటిని ఆయన పరిశీలించారు. 

Advertisement
Advertisement