కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు మా రాష్ట్ర ప్రాజెక్టుకూ ఇవ్వండి

ABN , First Publish Date - 2021-12-04T07:15:33+05:30 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇచ్చి ఇతర ప్రాజెక్టుల మాదిరి సమాన అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌..

కర్ణాటక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు మా రాష్ట్ర ప్రాజెక్టుకూ ఇవ్వండి

ప్రధాని మోదీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి

హైదరాబాద్‌, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం లేదా పాలమూరు ఎత్తిపోతల పథకాలకు జాతీయ హోదా ఇచ్చి ఇతర ప్రాజెక్టుల మాదిరి సమాన అవకాశం కల్పించాలని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌.. ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో శుక్రవారం ఆయన పోస్టు చేశారు. కాళేశ్వరం లేదా పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రానికి అనేక సార్లు విజ్ఞప్తి చేసినా కేంద్రం వాటిని పట్టించుకోలేదని గుర్తుచేశారు. గతంలో తాము తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా డిమాండ్‌ చేస్తే... నాడు కేంద్ర మంత్రిగా ఉన్న నితిన్‌ గడ్కరీ దేశంలో ఏ ప్రాజెక్టుకూ జాతీయ హోదా ఇవ్వబోమని చెప్పిన విషయాన్ని కేటీఆర్‌ ఉటంకించారు. కర్ణాటకలోని అప్పర్‌ భద్ర ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ ప్రాజెక్టులకూ హోదా ఇవ్వాలని, 6నజరిగే సమావేశంలో ఈ అంశంపై చర్చించాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-12-04T07:15:33+05:30 IST