అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు అందజేస్తాం

ABN , First Publish Date - 2020-02-23T07:07:56+05:30 IST

అర్హులైన ప్రతి రై తుకూ పట్టాపాస్‌ పుస్తకాలను అందజేస్తామని రా ష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే

అర్హులందరికీ పట్టా పాసుపుస్తకాలు అందజేస్తాం

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి


బాన్సువాడ, ఫిబ్రవరి 22: అర్హులైన ప్రతి రై తుకూ పట్టాపాస్‌ పుస్తకాలను అందజేస్తామని రా ష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. శనివారం బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోటగిరి మండలానికి చెం దిన చేతన్‌నగర్‌, కొత్తపల్లి, జల్లాపల్లి, కల్లూర్‌ గ్రా మాలకు చెందిన రైతులకు స్పీకర్‌ పోచారం చేతుల మీదుగా నూతన పట్టాపాస్‌ పుస్తకాలను అంద జేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు, ఫారెస్టు, రెవెన్యూ శాఖల సమన్వయం లేకపోవడం తో రైతులకు పట్టాపాస్‌ పుస్తకాలు పంపిణీలో తీవ్ర జాప్యం జరిగిందన్నారు.


రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ ప్రక్షాళనలో భాగంగా ప్రతీ గ్రామ గ్రా మాన రైతు వివరాలను సేకరించి వివాదాస్పద భూ ములను పార్ట్‌ బీలో పొందుపర్చడం జరిగిందన్నా రు. రెవెన్యూ, ఫారెస్టు అధికారులు సమన్వయంతో గ్రామంలో వివాదాస్పద భూములను సర్వే చేసి అ ర్హులైన వారందరికీ పట్టాపాస్‌ పుస్తకాలను అంద జేసేలా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నో  ఏళ్లుగా సమస్య ఉన్న నిజాంషుగర్‌ ఫ్యాక్టరీ సంబ ంధిత భూములను సర్వే చేసి 42 మంది లబ్ధిదా రులకు కొత్తపల్లి, జల్లాపల్లి, కల్లూర్‌ గ్రామ రైతులకు అందజేశామన్నారు. చేతన్‌నగర్‌ గ్రామానికి చెందిన 70 మందికి నూతన పట్టాపాస్‌ పుస్తకాలను అంద జేయడం జరిగిందన్నారు.


అర్హులైన ప్రతీ రైతుకు తప్పకుండా పట్టాపాస్‌ పుస్తకాలు అందజేస్తామ న్నారు. అదేవిధంగా నియోజకవర్గంలో మరికొన్ని మండలాల్లో వివాదాస్పద భూములు, పార్ట్‌ బీ భూములను కూడా సర్వే చేశామని, వాటిని కూడా  అందజేస్తామన్నారు. అంతేకాకుండా కోటగిరి మ ండలంలోని మైనార్టీ కార్పొరేషన్‌ ద్వారా 34 మందికి సబ్సిడీ రుణాలు మంజూరయ్యాయని, ఒక్కొక్కరికి రూ. 80 వేల చొప్పున చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కోటగిరి మండలంలోని 10 మంది లబ్ధిదారులకు, చందూర్‌ మండలానికి చెం దిన ఆరుగురు లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ పథకం కింద ఒక్కొక్కరికి రూ. లక్షా 116ల చెక్కును అంద జేయడం జరిగింది.  తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తుందని, రాష్ట్రంలోని ప్రతి రైతుకు తప్పకుండా పట్టాపాస్‌ పుస్తకాలు అందజేస్తామని, ఎలాంటి ఆం దోళన చెందవద్దని ఆయన సూచించారు. ఈ కార్య క్రమంలో జుక్కల్‌ ఎమ్మెల్యే హన్మంత్‌ షిండే, కోట గిరి మండల ప్రజా ప్రతినిధులు, అధికారులు తది తరులు పాల్గొన్నారు. 


 బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

 బీర్కూర్‌: తెలంగాణ తిరుమల దేవస్థానంలో ఈ నెల 29వ తేది నుంచి పంచమ వార్షిక బ్రహ్మో త్సవాలు ప్రారంభం అవుతున్నాయని, బ్రహ్మోత్స వాలను భక్తులు విజయవంతం చేయాలని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం బీర్కూర్‌ శివారులోని తెలంగాణ తిరు మల దేవస్థానాన్ని ఆయన సందర్శించారు. ఆలయ సన్నిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను పరిశీ లించారు. పనులు త్వరిత గతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన ఆలయ కమిటీ సభ్యులకు సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీ నుంచి మార్చి 5వ తేదీ వరకు పంచమ వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ బ్రహ్మోత్సవాలకు భక్తు లు వేలాది మంది హాజరు అవుతారని, భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు కలుగకుండా సకల సౌకర్యాల ను కల్పించాలని ఆయన ఆలయ కమిటీకి సూచిం చారు.


శ్రీవారి సన్నిధిలో ప్రతీ శనివారం అన్నదాన కార్యక్రమం కొనసాగుతుందని, ఈ మేరకు దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అన్నదాన కార్యక్ర మానికి విరాళాలు అందించడం హర్షనీయమ న్నారు. దుర్కి గ్రామానికి చెందిన మాజీ జడ్పీటీసీ కిషోర్‌ యాదవ్‌ - లక్ష్మీ దంపతులు స్పీకర్‌ పోచా రం శ్రీనివాస్‌ రెడ్డికి శాశ్వత అన్నదానం నిమిత్తం రూ. 25 వేల విరాళాన్ని అందజేశారు. ఈ కార్య క్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగే శ్వర్‌రావు, అప్పారావు, ద్రోణవల్లి అశోక్‌, నర్సరాజు, మురళి, రాంబాబు, రఘు, శ్రీనివాస్‌, తది తరులున్నారు.   

Updated Date - 2020-02-23T07:07:56+05:30 IST