మెరుగైన వైద్య సేవలు అందించాలి

ABN , First Publish Date - 2020-12-03T06:08:13+05:30 IST

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు.

మెరుగైన వైద్య సేవలు అందించాలి
వైద్య అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

 కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ

నిర్మల్‌ టౌన్‌, డిసెంబరు 2 : ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ వైద్య శాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం సారంగాపూర్‌, దిలావర్‌పూర్‌, ముజ్గి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆకస్మిక తనిఖీ చేసి, వైద్య అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. సారంగాపూర్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ధరణి రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పరిశీలించిన అనంతరం ధరణి పాస్‌ బుక్‌ ప్రతులను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. డాక్టర్లు, వైద్య ఉద్యోగుల బయోమెట్రిక్‌ హజరు శాతాన్ని పరిశీలించి, సమయపాలన పాటించాలని సూచించారు. సీసీ కెమెరాల పని తీరును పరిశీలించారు. ఆసుపత్రిలో పరిసరాల పరిశుభ్రత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ధన్‌రాజ్‌, తహసీల్దార్‌ తుకారాం, ఈడిస్ర్టిక్ట్‌ మేనేజర్‌ నదీమ్‌, డాక్టర్‌ కార్తీక్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

మార్కెట్‌ యార్డులలో వసతులు కల్పించాలి

జిల్లాలోని మార్కెట్‌ యార్డులలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేకచర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో నిర్వహించిన మార్కెట్‌ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలోని మార్కెట్‌ యార్డులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కనీస మౌళిక సదుపాయాలు కల్పించాలని అన్నారు. అలాగే మార్కెట్‌ యార్డులలో పని చేసే హమాలీలకు ఇతర ఉద్యోగుల చార్జీలను పెంచడం జరిగిందని అన్నారు. ఈ సమావేశంలో జిల్లా మార్కెట్‌ సహాయ సంచాలకులు శ్రీనివాస్‌, జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారి కిరణ్‌కుమార్‌, మార్కెట్‌ కార్యదర్శులు అడెల్లు, ఇర్ఫాన్‌, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలి

ఫ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆకస్మిక తనిఖీలో కలెక్టర్‌

దిలావర్‌పూర్‌, డిసెంబరు 2 : వైద్య సిబ్బంది రోగులకు అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ అలీ ఫారూఖీ అన్నారు. దిలావర్‌పూర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఆరో గ్య కేంద్రాన్ని బుధవారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. కాగా దిలావర్‌పూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నేషనల్‌ క్వాలిటీ అస్యూరెన్స్‌ ప్రోగ్రాం పథకానికి సెలెక్ట్‌ అయినందున వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య కేంద్రంలో ఉన్న పెండింగ్‌వర్క్స్‌ గురించి అడిగారు. ఆసుపత్రిలో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్‌ ఉన్నాయా ? అవి సక్రమంగా పని చేస్తున్నాయా అని ఆరా తీశారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి ఆవరణ మొక్కలతో పచ్చదనం సంతరించుకోవడంతో కలెక్టర్‌ వైద్య సిబ్బందిని అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్‌వో ధన్‌రాజ్‌, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీకాంత్‌, డీఎస్‌వో డా. కార్తీక్‌, పీవో ఎంహెచ్‌ఎన్‌ డా. కిరణ్మయి, దిలావర్‌పూర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డా. శ్యాంకుమార్‌, ఎంఆర్‌వో సంతోష్‌ రెడ్డి, ఎంపీవో అజీజ్‌ఖాన్‌, సర్పంచ్‌ వీరేష్‌ కుమార్‌, పీహెచ్‌ఎన్‌ జయ ప్రమోద, సూపర్‌వైజర్‌ జగన్‌, స్టాఫ్‌ నర్సు స్వప్న, నిర్మల, ల్యాబ్‌ టెక్నీషియన్‌ రాజశేఖర్‌, హెల్త్‌ అసిస్టెంట్‌ రాజశేఖర్‌ పాల్గొన్నారు. 

తహసీల్దార్‌ కార్యాలయాన్ని 

పరిశీలించిన కలెక్టర్‌

సారంగాపూర్‌, డిసెంబరు 2 : మండలంలో గల తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ అలీ పరిశీలించారు. ఈ నేపథ్యంలో సాగు భూముల రిజిస్ర్టేషన్‌ల వివరాలను తహసీల్దార్‌ తుకారాం ను అడిగి తెలుసుకున్నారు. అధికారులు సాగు భూము లను రిజిస్ర్టేషన్‌ చేసే సమయంలో రిజిస్ర్టేషన్‌కు అయ్యే ఖర్చులు కాకుండా అదనంగా డబ్బులని తీసుకుంటున్నారా అని రైతులకు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు భూ మార్పిడి జరుగుతున్నాయ అని ధరణి ఆపరేటర్‌ను అడుగ గా 5 నుంచి 8 రిజిస్ర్టేషన్‌లు చేస్తున్నామని తెలిపారు. ఈయన వెంట ఎంపీపీ అట్ల మహిపాల్‌రెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ సంతోష్‌, రెవెన్యూ సిబ్బందిలు ఉన్నారు

ఆదిలాబాద్‌ జడ్జిని కలిసిన కలెక్టర్‌

నిర్మల్‌ కల్చరల్‌, డిసెంబరు 2 : ఆదిలాబాద్‌ జిల్లా కోర్టు జడ్జి బీఎస్‌ జగ్జీవన్‌కుమార్‌ను నిర్మల్‌ జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీ కోర్టు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జికి పూలకుండి అందజేశారు. . 

Updated Date - 2020-12-03T06:08:13+05:30 IST