Abn logo
Sep 21 2020 @ 00:44AM

రైతుబంధు డబ్బులను త్వరగా ఇప్పించండి

జడ్పీ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ 

కొవిడ్‌-19 నిబంధనలతో 1,3జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు 

2,4,5,6,7 స్థాయీసంఘాల సభ్యుల గైర్హాజరుతో సమావేశాలు వాయిదా


కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 20: రైతుబంధు పథకం కింద రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను త్వరగా ఇప్పించా లని, రైతులకు ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ కనుమల్ల విజయ జిల్లా వ్యవసా యాధికారిని ఆదేశించారు. ఆదివారం కొవిడ్‌-19 నిబంధ నలతో జడ్పీ సమావేశమందిరంలో జరిగిన జడ్పీ 1,3 స్థాయీసంఘాల సమావేశాల్లో ఆమె పాల్గొని ప్రసంగిం చారు. జడ్పీ వైస్‌చైర్మన్‌, మూడవస్థాయి సంఘం అధ్య క్షుడు పేరాల గోపాల్‌రావు అధ్యక్షతన జరిగిన వ్యవ సాయం, ఉద్యానవనశాఖ, మార్కెటింగ్‌, సహకార, అటవీ, మత్స్య, పశుసంవర్థక, భూగర్జజల శాఖలకు సంబంధిం చిన అంశాలపై చర్చించారు.


ఈసందర్బంగా జడ్పీ చైర్‌ప ర్సన్‌ మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగకుండా వారికి సహాయసహ కారాలను అందించాలని అధికారు లకు సూచించారు. రుణమాఫీ, రుణాల వివరాలను అందించా లని గోపాల్‌రావు అధి కారులను కోరారు. ఒక టవ స్థాయీసంఘ సమావేశానికి అధ్యక్షత వహించిన జడ్పీ చైర్‌ప ర్సన్‌ పీఆర్‌శాఖ ఆధ్వ ర్యంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను అందించాలని కోరారు. సమావేశాల్లో జడ్పీ సభ్యులు పురుమల్ల లలిత, పలువురు అధికారులు పాల్గొన్నారు. 2,4,5,6,7 స్థాయీ సంఘాల సభ్యులు హాజరుకాకపోవడంతో సమావేశాలను వాయిదా వేసినట్లు జడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, సీఈవో వెంకటమాధవరావు ప్రకటించారు.

Advertisement
Advertisement
Advertisement