Advertisement
Advertisement
Abn logo
Advertisement

మా భూమిని ఇప్పించండి

ఆత్మకూరు(ఎం), డిసెంబరు 1: నిత్యం మద్యం మత్తులో ఉంటున్న ఓ అమాయక రైతు బలహీనతను ఓ మాజీ సర్పంచ్‌ ఆసరా చేసుకున్నాడు. అతని పేర ఉన్న 3.21 ఎకరాల భూమిని మాజీ సర్పంచ్‌ తన పేరుతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న సదరు రైతు భార్య మాజీ సర్పంచ్‌ ఇంటికి వెళ్లగా అతను అందుబాటులో లేడు. దీంతో తమ భూమి తమకు కావాల ని కోరుతూ పురుగులమందు డబ్బాతో బుధవారం మాజీ సర్పంచ్‌ ఇంటి ఎదుట ఆత్మహత్మాయత్నం చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం ఉప్పలపహాడ్‌ గ్రామంలో ఈ ఘటన బుధవారం జరిగింది. మహిళా రైతు, బాధితురాలు లగ్గాని సోని వివరాల ప్రకారం.. గ్రా మానికి చెందిన లగ్గాని రమే్‌షతో సోనికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. కట్నకానుకల కింద అత్తగా రు 3.21 ఎకరాల భూమిని ఇచ్చారు. మద్యానికి బానిసైన రమేష్‌ బలహీనతను ఆసరా చేసుకున్న అదే గ్రామ మాజీ సర్పంచ్‌ ఏనుగు ప్రతాపరెడ్డి (ప్రస్తుతం ఉప్పల్‌లో ఉంటున్నాడు) భూమిని కా జేయాలని చూశాడు. తనకు వేరే ప్రాంతంలో ఉన్న భూమిని ఇస్తాననని, రమేష్‌ పేరున ఉన్న 3.21ఎకరాల భూమి తనకు ఇవ్వాలని ప్రతాపరెడ్డి కోరాడు. మాజీ సర్పంచ్‌ మాయమాటలు విన్న రమేష్‌ ఎలాంటి డబ్బులు తీసుకోకుండా, భార్య, తల్లిదండ్రులకు తెలియకుండా భూమిని నవంబ రు 29న ప్రతాపరెడ్డి పేరున రిజిస్ట్రేషన్‌ చేశాడని సోని తెలిపారు. తన భూమి తిరిగి రిజిస్ర్టేషన్‌ చేయకపోతే తన కుమార్తె సహా ఆత్మహత్య చేసుకుంటామని సోని హెచ్చరించారు. ఆందోళన విష యం తెలుసుకున్న ఎస్‌ఐ మధు గ్రామానికి వెళ్లి మాజీ సర్పంచ్‌తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో సోని ఆందోళన విరమించారు. అక్కడే ఉన్న రమేష్‌ మాట్లాడుతూ తాగినమైకంలో రిజిస్ట్రేషన్‌ చేశానని, తన భూమి తిరిగి రిజిస్ట్రేషన్‌ చేయించుకుంటానన్నాడు.  

Advertisement
Advertisement