80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించండి

ABN , First Publish Date - 2021-05-11T05:32:15+05:30 IST

ఓ వైపు కరోనా మహమ్మారి.. ఇంకో వైపు గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో అతివృష్ఠి కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు 80 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.

80 శాతం సబ్సిడీపై విత్తనాలు అందించండి

  1.   రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం 


కర్నూలు(అగ్రికల్చర్‌), మే 10: ఓ వైపు కరోనా మహమ్మారి.. ఇంకో వైపు గత ఖరీఫ్‌, రబీ సీజన్లలో అతివృష్ఠి కారణంగా పంటలు కోల్పోయిన రైతులకు  80 శాతం సబ్సిడీతో వేరుశనగ విత్తనాలను అందించాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జగన్నాథం సోమవారం ఒక పత్రికా ప్రకటనలో సీఎంకు విజ్ఞప్తి చేశారు. మరో 15 రోజుల్లో ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమవుతుందని, ఽకాబట్టి 80 శాతం సబ్సిడీపై విత్తనాలు ఇవ్వాలని కోరారు. మార్కెట్‌లో ఒక క్వింటం వేరుశనగ ధర రూ.5,500 ఉందని, అంత చెల్లించే స్థితిలో రైతులు లేరని ఆయన అన్నారు.  ప్రభుత్వం తప్పనిసరిగా 80 శాతం రాయి తీపై విత్తనాలను ఇవ్వాలని కోరారు.  గత సంవత్సరం మిగిలి పోయిన విత్తనాలను కొత్త సంచుల్లో విత్తనాలను నింపి ఈ సంవత్సరం ఖరీఫ్‌లో రైతులకు అంటగట్టేందుకు వ్యాపారులు ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. కల్లూరు పారిశ్రామిక వాడ, బళ్లారి చౌరస్తా ప్రాంతాల్లోని గోదాముల్లో కాలం చెల్లిన విత్తనాల ప్యాకింగ్‌ జోరుగా సాగుతోందని ఆయన అన్నారు. వ్యవసా యాధికారులు ఈ విషయంలో చర్యలు తీసుకొనేలా చూడాలని ఆయన  ముఖ్యమంత్రికి రాసిన వినతి పత్రంలో పేర్కొన్నారు. 


Updated Date - 2021-05-11T05:32:15+05:30 IST