రూపాయి ఇవ్వడం... వంద రూపాయలు గుంజడం

ABN , First Publish Date - 2021-06-17T07:11:27+05:30 IST

ప్రజలకు రూపాయి ఇవ్వడం... పరోక్షంగా వారినుంచి వంద రూపాయలు గుంజడమే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తిరుపతి బీజేపీ నాయకులు విమర్శించారు.

రూపాయి ఇవ్వడం... వంద రూపాయలు గుంజడం
మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహిస్తున్న బీజేపీ నాయకులు

 తిరుపతి(పద్మావతినగర్‌), జూన్‌ 16: ప్రజలకు రూపాయి ఇవ్వడం... పరోక్షంగా వారినుంచి వంద రూపాయలు గుంజడమే రాష్ట్ర ప్రభుత్వ విధానాన్ని తిరుపతి బీజేపీ నాయకులు విమర్శించారు.నూతన పన్ను విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ ఆ పార్టీ నాయకులు స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో బుధవారం నిరసన ప్రదర్శన చేశారు.బీజేపీ అధికార ప్రతినిధులు భానుప్రకాష్‌రెడ్డి, సామంచి శ్రీనివాస్‌ మాట్లాడుతూ... కొవిడ్‌ కారణంగా ప్రజలు ఆర్థికంగా చితికిపోయారని, ఈ సమయంలో ముఖ్యమంత్రి పన్నులు పెంచి ప్రజలను ఇబ్బంది పెట్టడం తగదని విమర్శించారు. ఉచిత పథకాల పేరిట డబ్బు ఇస్తూ... పన్నుల పేరిట తిరిగి దండుకుంటూ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తోందన్నారు. బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మునిసుబ్రహ్మణ్యం, జిల్లా ప్రధాన కార్యదర్శి రాటకొండ విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. చెత్త సేకరణకు ప్రజల నుంచి వసూలు చేస్తున్న రుసుంను రద్దు చేయాలని కోరారు.  

Updated Date - 2021-06-17T07:11:27+05:30 IST