Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఇంకోసారి నా భార్య జోలికి రావద్దంటూ 10 మంది కుర్రాళ్లకు వార్నింగ్ ఇచ్చాడా భర్త.. ఇంటికి వెళ్లిన కొద్ది సేపటికే..

నేటి యువతలో చాలా మంది చెడు వ్యసనాలకు బానిసై.. ఎలాంటి దారుణాలు చేయడానికైనా వెనకాడడం లేదు. తద్వారా వారి బంగారు భవిష్యత్‌ను పాడు చేసుకుంటున్నారు. హర్యానాలో జరిగిన ఘటన.. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువకుల పరిస్థితికి అద్దం పడుతోంది. ఆ యువకులు ఓ మహిళను వేధించేవారు. భర్తకు తెలియడంతో ఇంకోసారి తన భార్య జోలికి రావద్దంటూ పది మంది కుర్రాళ్లకు వార్నింగ్ ఇచ్చాడు. తర్వాత ఇంటికి వెళ్లిన అతనికి షాకింగ్ సీన్ కనిపించింది. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని అంబాలా కాంట్‌, ఘసిత్‌పూర్‌ సెక్టార్-34లోని క్వార్టర్స్‌లో గురుదేవ్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కూలి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకున్నాడు. అదే క్వార్టర్స్‌లో ఓ పది మంది కుర్రాళ్లు అల్లరి చిల్లరిగా తిరిగేవారు. ఈ క్రమంలో వారు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు. పలువురికి డ్రగ్స్‌ను విక్రయించేవారు. చీటికీమాటికీ అందరితో గొడవలు పెట్టుకునేవారు. ఈ క్రమంలో ఓ రోజు గురుదేవ్ భార్య ఒక్కటి.. నడుచుకుంటూ వెళ్తూ ఆ యువకులకు తారసపడింది. ఆ సమయంలో వారు ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. ఎలాగోలా వారి నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్లి.. భర్తకు విషయం తెలిపింది.

దీంతో యువకుల దగ్గరికి వెళ్లిన గురుదేవ్.. తన భార్య జోలికి రావద్దంటూ హెచ్చరించాడు. తర్వాత  అక్కడి నుంచి ఇంటికి వెళ్లిపోయాడు. అప్పటికే గురుదేవ్‌పై కోపంతో ఉన్న యువకులు.. అతడి ఇంటికి వెళ్లి వీరంగం సృష్టించారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ చెల్లాచెదురుగా పడేసి, ధ్వంసం చేశారు. ఇంటికి వెళ్లిన గురుదేవ్.. అక్కడ జరుగుతున్న పరిస్థితిని చూసి షాక్ అయ్యాడు. వారిని అడ్డుకోబోగా గురుదేవ్‌పై కూడా దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా అతడి భార్య, పిల్లలపై కూడా దాడి చేశారు. కత్తిపోట్లు తగలడంతో గురుదేవ్.. తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని గురుదేవ్‌ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement