అద్దాల వంతెన!

ABN , First Publish Date - 2021-07-16T05:30:00+05:30 IST

ఆ వంతెనపై నడవాలంటే గుండె ధైర్యం కాస్త ఎక్కువే ఉండాలి. ఎందుకంటే అది అద్దాల వంతెన. చైనాలోని హాంగ్‌యాగు ప్రాంతంలో నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది...

అద్దాల వంతెన!

ఆ వంతెనపై నడవాలంటే గుండె ధైర్యం కాస్త ఎక్కువే ఉండాలి. ఎందుకంటే అది అద్దాల వంతెన. చైనాలోని హాంగ్‌యాగు ప్రాంతంలో నిర్మించిన ఈ వంతెన ఇప్పుడు పర్యాటక ప్రదేశంగా గుర్తింపు పొందింది.


  1. రెండు కొండలను  కలుపుతూ నిర్మించిన ఈ వంతెన పొడవు 488 మీటర్లు. 715 అడుగుల ఎత్తులో నిర్మించారు.
  2. ఒకటిన్నర అంగుళాల మందం గల అద్దాలతో ఈ వంతెన నిర్మించారు. ఒకేసారి ఐదు వందల మంది నడిచినా వంతెన చెక్కుచెదరకుండా ఉండేలా నిర్మాణం చేశారు. ఈ అద్దాల వంతెనపై నడవడానికి పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు.

Updated Date - 2021-07-16T05:30:00+05:30 IST