3.5 లక్షలు దాటిన కరోనా మృతుల సంఖ్య

ABN , First Publish Date - 2020-05-28T02:31:46+05:30 IST

కొవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు దాటింది.

3.5 లక్షలు దాటిన కరోనా మృతుల సంఖ్య

పారిస్: కొవిడ్-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా మరణించిన వారి సంఖ్య 3.5 లక్షలు దాటింది.  ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 55,89,389 కేసులు నమోదవగా.. కరోనా బారిన పడి మొత్తంగా 3,53,615 మంది మృత్యువాతపడ్డారు. అమెరికాలోనే అత్యధికంగా 1,00,825 మంది కరోనా బారిన పడి మరణించారు. అమెరికాలో కరోనా కేసుల సంఖ్య కూడా 17,30,479కి చేరింది. అమెరికా తరువాత అత్యధిక కేసుల సంఖ్యలో బ్రెజిల్ ఉండగా.. మరణాల సంఖ్యలో యూకే ఉంది. యూకేలో ఇప్పటివరకు 2,67,240 మంది కరోనా బారిన పడగా.. 37,460 మంది మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాల సంఖ్యలో అమెరికా, యూకే తరువాతి మూడు స్థానాల్లో ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఉన్నాయి. ఇటలీలో ఇప్పటివరకు 2,30,555 కేసులు నమోదుకాగా.. కరోనా బారిన పడి 32,955 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్రాన్స్‌లో మొత్తంగా 1,82,722 కేసులు నమోదుకాగా.. 28,530 మంది మరణించారు. ఇక స్పెయిన్‌లో కేసులు 2,83,339 నమోదైతే.. 27,117 మంది చనిపోయారు. 

Updated Date - 2020-05-28T02:31:46+05:30 IST