ఘనంగా అంబేడ్కర్‌ జయంతి

ABN , First Publish Date - 2022-04-15T06:36:39+05:30 IST

నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, వైసీపీ నాయకులు బొమ్మల సత్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

ఘనంగా అంబేడ్కర్‌ జయంతి
డోన్‌లో నివాళి అర్పిస్తున్న ధర్మవరం సుబ్బారెడ్డి

నంద్యాల (నూనెపల్లె), ఏప్రిల్‌ 14: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిశోర్‌రెడ్డి, వైసీపీ నాయకులు బొమ్మల సత్రంలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.


 జిల్లా ఎస్పీ కార్యాలయంలో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ చిత్రపటానికి ఎస్పీ రఘువీరారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్‌ఎస్‌ఐలు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. 


 బొమ్మలసత్రంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మార్పీఎస్‌, దళిత, ప్రజా సంఘాలు, ఎస్పీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, విద్యార్థి యువజన సంఘం, ఏపీటీఎఫ్‌ 1938 ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. పీఆర్‌టీయూ, ఎస్టీయూ కార్యాలయాల్లో వేడుకలు నిర్వహించారు. 


జిల్లాలోని ఎక్సైజ్‌ శాఖ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమని కర్నూలు జిల్లా ఎక్సైజ్‌ శాఖ డిప్యూటీ కమీషనర్‌ మునిస్వామి, ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ రవికృష్ణ అన్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతిని పురస్కరించుకొని పట్టణ శివార్లలోని ఏపీఎస్‌బీసీఎల్‌ ఐఎంఎల్‌ డీపో ఆవరణంలో రక్తదాన శిబిరం జరిగింది. డిప్యూటీ కమిషనర్‌ మునిస్వామి, డాక్టర్‌ రవికృష్ణ, నంద్యాల జిల్లా ఎక్సైజ్‌ కార్యాలయం జిల్లా అధికారి రవికుమార్‌రెడ్డి, డిపో ఇన్‌స్పెక్టర్లు కృష్ణకుమార్‌, రామకృష్ణారెడ్డి, కర్నూలు జిల్లా ఎక్సైజ్‌ శాఖ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు ఓబులేసులు హాజరై అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పోలీసులు, సిబ్బంది, ప్రభుత్వ మద్యం దుకాణాలలో పనిచేసే సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్లు స్వచ్చందంగా పాల్గొని రక్తదానం చేశారు. 


డోన్‌: అంతరాలు లేని సమాజ నిర్మాణ కోసం డా.బీఆర్‌ అంబేడ్కర్‌ రాజ్యాంగాన్ని రచించారని.. ఆయన ఆశయాల సాధన టీడీపీతోనే సాధ్యమని టీడీపీ డోన్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి ధర్మవరం సుబ్బారెడ్డి అన్నారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా గురువారం పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ వద్ద గల అంబేడ్కర్‌ విగ్రహానికి టీడీపీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళి అర్పించారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వలసల రామకృష్ణ, మన్నె గౌతంరెడ్డి, మాజీ ఎంపీపీ ఆర్‌ఈ రాఘవేంద్ర, పట్టణ టీడీపీ అధ్యక్షులు సీఎం శ్రీనివాసులు, ఎస్సీ సెల్‌ సభ్యులు గంధం శ్రీనివాస్‌, నంద్యాల జిల్లా బీసీ సెల్‌ అధ్యక్షులు ప్రజా వైద్యశాల మల్లికార్జున, కార్యదర్శి అభిరెడ్డిపల్లె గోవిందు, మామిళ్లపల్లి మోహన్‌ యాదవ్‌, జలదుర్గం విష్ణు, క్రిష్టన్న, గోవిందరెడ్డి, మర్రి ఉపేంద్ర, చక్రపాణి గౌడు, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు కుమ్మరి సుధాకర్‌, ఐటీడీపీ అధ్యక్షుడు హుశేన్‌పీరా, కేబుల్‌ కిరణ్‌ పాల్గొన్నారు.


డోన్‌ (రూరల్‌): పట్టణంలోని ఎన్జీవో కార్యాలయం, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్‌ జయంతి వేడుకలు నిర్వహించారు. ఎంఈఎఫ్‌, ఏపీ గిరిజన సమాఖ్య, నేషనల్‌ ట్రైబల్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. పట్టణంలోని ఎస్సీ, బీసీ, బాలికల హాస్టల్‌లో విద్యార్థినులకు ఐఎఫ్‌టీయూ ఆధ్వర్యంలో పరీక్షల ప్యాడ్లు, పెన్నులు అందజేశారు. కాంగ్రెస్‌ లోక్‌సభ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి గార్లపాటి మద్దిలేటి, జైభీమ్‌ ఆర్గనైజేషన్‌, సీఎన్‌ఆర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. మండలంలోని ధర్మవరం, కొత్తబురుజు గ్రామల్లో వేడుకలు నిర్వహించారు.


బనగానపల్లె: బనగానపల్లె పట్టణంలోని అవుకు మెట్ట వద్ద అంబేడ్కర్‌ జయంతి వేడుకలు మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్‌ విగ్రహానికి బీసీ పూలమాలలు వేసి నివాళి అర్పించా రు. భారత రాజ్యాంగాన్ని రచించిన మహామేధావి అని బీసీ కొనియాడారు. బడుగుబలహీన వర్గాల వర్గాల వారికి ఆయన అందించిన సేవలు ఎనలేని వన్నారు. బంజారా రాష్ట్ర సంఘం నాయకులు వెంకటరమణనాయక్‌, పార్లమెం ట్‌ ఎస్టీ సెల్‌ అధ్యక్షుడు కృష్ణానాయక్‌, వాణిజ్య విభాగం అధ్యక్షుడు టంగుటూరు శ్రీనయ్య, తెలుగు యువత అధ్యక్షుడు బొబ్బల గోపాల్‌రెడ్డి, పవన్‌ కుమార్‌రెడ్డి, శరత్‌కుమార్‌రెడ్డి, పాతపాడు సర్పంచ్‌ మహేశ్వరరెడ్డి, బనగానపల్లె ఉపసర్పంచ్‌ బురానుద్దీన్‌, వార్డు సభ్యులు కలాం, నాగేంద్ర, కొత్తపేట బాలరాజు, బాలుడు, సలాం, కలాం, ఖాదర్‌, విష్ణువర్దన్‌రెడ్డి, మంగంపేట శ్రీను, తదితరులు పాల్గొన్నారు.


 పాణ్యం: పాణ్యంలోని ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అంబేడ్కర్‌ సాధన సమితి, ఎమ్మార్పీఎస్‌, ప్రజా, విద్యార్థి సంఘాలు, టీడీపీ, వైసీపీ, బీజేపీ జైభీమ్‌ ఆధ్వర్యంలో నివాళి అర్పించారు. దళిత సంఘం ఆధ్వర్యంలో అంబేడ్కర్‌ చిత్రపటాన్ని ఊరేగించారు. 


ఆళ్లగడ్డ: ఆళ్లగడ్డలోని నాలుగు రోడ్ల కూడలిలోని అంబేడ్కర్‌ విగ్రహానికి ఎమ్మెల్యే బిజేంద్రారెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కేవీఎస్సార్‌, గిరిజన ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో, ప్రభుత్వ కార్యాలయాల్లో అంబేడ్కర్‌ జయంతి నిర్వహించారు. 


నందికొట్కూరు: నందికొట్కూరు పట్టణంలో అంబేడ్కర్‌ జయతి వేడుకలు నిర్వహించారు.  టీడీపీ నాయకులు జాకీర్‌హుసేన్‌, జయసూర్య, చిన్న వెంకటస్వామి, మద్దిలేటి పాల్గొన్నారు. పట్టణంలోని మిడుతూరురోడ్డు, మున్సిపల్‌ కార్యాలయంలో ఉన్న అంబేడ్కర్‌ విగ్రహాలకు ఎమ్మెల్యే ఆర్థర్‌ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. సీపీఎం, ఎమ్మార్పీఎస్‌, మాలమహానాడు, ప్రజా సంఘాల నాయకులు అంబేద్కర్‌ విగ్రహాలకు పూలమాల  వేసి నివాళి అర్పించారు. 




Updated Date - 2022-04-15T06:36:39+05:30 IST