సీతారామచంద్రస్వామికి ఘనంగా అభిషేకం

ABN , First Publish Date - 2021-04-20T06:12:00+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో సీతారామచంద్రస్వామివారలకు సోమవారం ఘనంగా అభిషేకం నిర్వహించారు.

సీతారామచంద్రస్వామికి ఘనంగా అభిషేకం
నంది-గరుత్మంతుడు వాహనాలపై విహరిస్తున్న స్వామివారలు

  వేములవాడ, ఏప్రిల్‌ 19 : వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రంలో  సీతారామచంద్రస్వామివారలకు సోమవారం ఘనంగా అభిషేకం నిర్వహించారు. శ్రీరామ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏడో రోజు ఉదయం ఆలయ అర్చకులు  రాజరాజేశ్వరస్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం,  సీతారామచంద్రస్వామివారికి ఉపనిషత్‌ ద్వారా అభిషేకం చేశారు. భక్తోత్సవంలో భాగంగా అర్చకులు వేదపండితులు ప్రత్యేక పూజలు, యాగశాలలో హవనము, పరివార, అనుబంధ దేవతలకు అభిషేకములు నిర్వహించారు. రాత్రి  పార్వతీరాజరాజేశ్వరస్వామి,  లక్ష్మిఅనంతపద్మనాభస్వామివారలను నంది, గరుత్మంతుడు వాహనాలపై ఆలయ ఆవరణలో ఊరేగించారు. 

Updated Date - 2021-04-20T06:12:00+05:30 IST