Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైభవంగా అప్పన్న కళ్యాణం

సింహాచలం, డిసెంబరు 6: సింహాద్రి అప్పన్న స్వామి నిత్య కళ్యాణాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా సోమవారం ప్రభాత ఆరాధనల తర్వాత సహస్రనామార్చనలు చేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి విశ్వక్సేనారాధన, పుణ్యాహవచాలు చేశాక పవిత్ర జలాలతో పూజా ద్రవ్యాలను, భక్తులను ప్రోక్షణ గావించారు. శాస్త్రోక్తంగా కంకణధారణ చేసి నూతన యజ్ఞోపవీత సమర్పణ జరిపాక మంగళ వాయిద్యాల నడుమ జీలకర్ర, బెల్లం, మాంగళ్యధారణలు చేసి వేడుకగా అక్షితారోపణ (తలంబ్రాలు) జరిపారు. అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, ప్రసాదాలను అందజేశారు.


Advertisement
Advertisement