వైభవంగా ఎడ్‌బిడ్‌ మల్లన్నజాతర

ABN , First Publish Date - 2021-03-02T05:51:32+05:30 IST

జిల్లా ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల మల్లన్నదేవుడి జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది,

వైభవంగా ఎడ్‌బిడ్‌ మల్లన్నజాతర
మల్లన్నదేవున్ని దర్శించుకుంటున్న భక్తులు

భారీగా తరలి వచ్చిన భక్తజన ం 

అలరించిన ఉత్సవాలు 

పెద్ద ఎత్తున అన్నదానం 

కుస్తీ పోటీలో పాల్గొన్న మల్లయోధులు 

ముథోల్‌, ఫిబ్రవరి, 1 : జిల్లా ముథోల్‌ మండలంలోని ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల మల్లన్నదేవుడి జాతర సోమవారం అంగరంగ వైభవంగా జరిగింది,  నిర్మల్‌ జిల్లా నుండే కాకుండా  అదిలాబాద్‌,  మంచిర్యాల, నిజామాబాద్‌, కామారెడ్డి, మహారాష్ట్ర నుండి  సైతం భారీసంఖ్యలో భక్త్తులు  తరలివచ్చి  మల్లన్నదేవుడిని దర్శించుకున్నారు, కోరినకోరికలను తీర్చాలని నిలువెత్తు బంగారాన్ని (బెల్లం) సమర్పించారు. మొక్కులు ఫలించడంతో  కొందరుభక్తులు ఆలయంలో సామూ హిక సత్యనారాయణ వ్రతాల్ని నిర్వహించారు. కోరిన కోరికలు నెరవేర్చే ఇల వేల్పుగా ఒక్కడి ప్రాంత ప్రజల నమ్మకం. ఈ జాతర సందర్భంగా సుమారు 15 వేలకు పైగా భక్తులు  తరలివచ్చి  మల్లన్నదేవున్ని  దర్శించుకున్నారు. ఎడ్‌ బిడ్‌ మల్లన్న ఆలయం పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో ప్రత్యేక ఆకర్షణగా రంగుల రాట్నాలు నిలిచాయి. జాతరకు వచ్చిన భక్తులో చిన్నలు, పెద్దలు ఈ రంగులరాట్నాలపై కూర్చోడానికి చాల ఇష్టపడుతారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీ ఆద్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అక్షర ఆసుపత్రి ఆధ్వర్యంలో డా.రమేష్‌రాథోడ్‌ ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ఈ జాతరలో ఎలాంటి అ వాంఛనీయ  సంఘటనలు జరుగకుండా ముథోల్‌ సీఐ అజయ్‌బాబు నేతృత్వం లో ఎస్పై అశోక్‌ ఆఽధ్వర్యంలో సుమారు 40 మంది పోలీసులు గట్టి బందో బస్తును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు లావణ్య రవీంధర్‌రెడ్డి. సర్పంచ్‌ స్వర్ణలతదత్తు, ఉపసర్పంచ్‌ ఉదయ్‌ ,నాయకులు రాజ రెడ్డి, మాణిక్‌రెడ్డి, విట్టల్‌రెడ్డి, విటల్‌యాదవ్‌, గురుప్రసాద్‌, ఆశన్నయాదవ్‌ గ్రామస్థులు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

ఫైనల్‌ కుస్తీపోటీలో మహారాష్ట్ర వాసి విజేత

జిల్లా ముథోల్‌  మండలం ఎడ్‌బిడ్‌ గ్రామంలో గల మల్లన్నజాతరలో భాగం గా నాలుగవరోజు అయిన సోమవారం నిర్వహించిన కుస్తీపోటీల్లో పైనల్‌ విజేతగా మహారాష్ట్రలోని ఇంగోలి చెందిన దిగంబర్‌ అనే మల్లయోదుడు గెలుపొందాడు, మహారాష్ట్రలోని వాసీం జిల్లాకు చెందిన జ్ఞానేశ్వర్‌, ఇంగోలి చెందిన దిగంబర్‌ లుకుస్తీపోటీల్లో తలపడగా  దిగంబర్‌  అనే మల్లయోదుడు విజయం సాధించాడు. ఈ యనకు ఆలయ కమిటీ నుండి నగదు రూ,  10 వేలు ఇవ్వగా ఎడ్‌బిడ్‌ గ్రామానికి చెందిన  బెజెంకి విట్టల్‌ రెడ్డి తన స్వంత డబ్బులతో 50 గ్రాముల వెండి కడియంను విజేతకు అందజేశారు, రూ.లక్ష రూపాయలతోఈ కుస్తీ పోటీలు మధ్యాహ్నం నుండి రాత్రి 7 గంటల వరకు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు దత్తాత్రి, సాయంరెడ్డి, బెజెంకి విట్టల్‌రెడ్డి, రవీంధర్‌రెడ్డి, గంగన్న, మాణిక్‌రెడ్డి, విఠల్‌రెడ్డి, విఠల్‌యాదవ్‌, గురు ప్రసాద్‌, నల్లబిట్టల్‌రెడ్డి, బి.విట్టల్‌రెడ్డి, ఆశన్న, నిమ్మపోతన్న, సీఐ అజయ్‌బాబు, ఎస్సై అశోక్‌ గ్రామస్థులు, ఆలయ కమిటీసభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:51:32+05:30 IST