ఘనంగా నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2022-01-24T05:22:53+05:30 IST

టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌ జన్మదిన వేడుకలను తెలుగుయువత ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వ హించారు

ఘనంగా నారా లోకేశ్‌ జన్మదిన వేడుకలు
కొత్తచెరువులో కేక్‌కట్‌ చేస్తున్న మాజీ మంత్రి పల్లె, టీడీపీ నాయకులు

కొత్తచెరువు, జనవరి 23: టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారాలోకేశ్‌ జన్మదిన వేడుకలను తెలుగుయువత ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వ హించారు. మండల పరిధిలోని కేశాపురం గ్రామంలో నిర్వహించిన ఈ వేడు కల్లో మాజీమంత్రి రఘునాథరెడ్డి పాల్గొన్నారు.  పల్లె కేక్‌కట్‌ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో టీటీడీపీ నియోజకవర్గ అధ్యక్షు డు కొత్తపల్లి జయప్రకాశ్‌, తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షుడు ఓబిరెడ్డి, ప్రధాన కార్యదర్శి మనోహర్‌, ఉపాఽధ్యక్షులు వైవీమురళీ, మండల అధ్యక్షుడు కిశోర్‌, టీడీపీ మండల కన్వీనర్‌లు రామక్రిష్ణ, ఒలిపి శ్రీనివాసులు, నాయకులు ఆదినారాయణ, మహేశ్‌రెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.

ధర్మవరం: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ జన్మదిన వేడు కలను తెలుగుయువత ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా స్థానిక షిర్డీసాయిబాబా దేవాలయంలో నారాలోకేశ్‌ పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఎన్టీఆర్‌ సర్కిల్‌ల్లో కేక్‌కట్‌ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. నారాలోకేశ్‌ మరిన్ని జన్మదిన వేడుకలను జరుపుకోవాలని తెలుగుయువత నాయకులు ఆకాంక్షించారు. అదేవిధంగా మం డలంలోని గొ ట్లూరు అనాథాశ్రమంలో  అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమం లో తెలుగుయువత పార్లమెంట్‌ అధికార ప్రతినిధి చిన్నూరు విజయ్‌చౌదరి, పార్లమెంట్‌ ఆర్గనైజింగ్‌ కార్యదర్శి తిరుమలేశ్‌, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షులు మధుసూదన్‌, తెలుగుయువతనాయకులు సంగాల బాలు, 40వ వార్డు టీడీపీ ఇన్‌చార్జ్‌ అశోక్‌, నాయకులు సాకేకుళ్లాయప్ప, బత్తలగంగాధర్‌, రవి, అమరా సుధాకర్‌నాయుడు, ఎన్బీకేహరి, గణేశ్‌, వాసు, పవన్‌, హేమరాజు,  సోషల్‌ మీడియా నాగేంద్రగౌడ్‌, బాబావలి, ఆంజనేయులు, వినోద్‌, ప్రకాశ్‌, రాము తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-01-24T05:22:53+05:30 IST