ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-25T05:15:54+05:30 IST

ఓర్వకల్లులోని బాలభారతి స్కూల్‌లో సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.

ఘనంగా జాతీయ బాలికా దినోత్సవం
ఆళ్లగడ్డలో మాట్లాడుతున్న సీఐ కృష్ణయ్య

ఓర్వకల్లు, జనవరి 24: ఓర్వకల్లులోని బాలభారతి స్కూల్‌లో సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీపీఎం సరళమ్మ, మానవ అభివృద్ధి యాంకర్‌ పర్సన్‌ పుణ్యవతి హాజరై మాట్లాడారు.  విద్యారినులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


శిరివెళ్ల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని యర్రగుంట్ల గంగుల తిమ్మారెడ్డి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీనివాసులు అన్నారు. కళాశాలలో సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గోవిందపల్లె, వీరారెడ్డిపల్లె జడ్పీ ఉన్నత పాఠశాలల హెచ్‌ఎంలు నాగలక్ష్మి, అలివేలమ్మలను అధ్యాపకులు సన్మానించారు. కార్యక్రమంలో ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారి వెంకటేశ్వర్లు, అధ్యాపకులు భాగ్యమ్మ, వసంత, పద్మావతి, రాజగోపాల్‌, బాలచింతలయ్య, సువర్ణరాజు, రఫి, కరీముల్లా పాల్గొన్నారు.


ఆళ్లగడ్డ: బాలికలు ఉన్నత చదువులు చదువుకోవాలని పట్టణ సీఐ కృష్ణయ్య సూచించారు. పట్టణంలోని బాలికోన్నత పాఠశాలలో సోమవారం జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పాఠశాలల్లో  బాలికల విద్య కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాయన్నారు. కార్యక్రమంలో హెచ్‌ఎం, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.


కేజీబీలో.. మండలంలోని కోటకందుకూరు కస్తూర్బా గాంధీ పాఠశాలలో ఎంఈవో శోభావివేకతి ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని సోమవారం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యుడు నాగమస్తాన్‌ విద్యార్థినులకు ఆహారం తీసుకునే విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం జమాలమ్మ పాల్గొన్నారు.


పాణ్యం: సుగాలిమెట్టలోని కస్తూర్బా పాఠశాలలో జాతీయ బాలిక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎ్‌సఎస్‌ వేణుగోపాల్‌ హాజరై మాట్లాడారు. పాఠశాలలో నిర్వహించిన డ్రాయింగ్‌, డిబేట్‌ పోటీలలో విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన పాఠశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ లలిత, అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. 


చాగలమర్రి: బాలికల విద్యను ప్రోత్సహించాలని ఎంఈవో అనూరాధ అన్నారు. సోమవారం చాగలమర్రి కస్తూర్బా పాఠశాల, కళాశాలలో జాతీయ బాలికా దినోత్సవం ఎస్‌వో హబిమున్నిసా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఎంఈవో మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు ముందుకు రావాలని కోరారు.  అనంతరం బాలికలు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో హెల్త్‌ ఎడ్యుకేటర్‌ వెంకటమ్మ, సీఆర్పీ అమీర్‌ఖాన్‌, ఉపాధ్యాయినిలు, విద్యార్థినులు పాల్గొన్నారు. 


దొర్నిపాడు: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ ప్రభాకరమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని చాకరాజువేముల గ్రామంలోని అంగన్‌వాడీ-1 కేంద్రంలో టీచర్‌ శారద ఆధ్వర్యంలో బాలికల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించి చిన్నారులకు బహుమతులు అందజేశారు. అనంతరం బాలికల  ఇంటి వద్ద మొక్కలను నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌ పద్మిని, ఆశా వర్కర్‌ తిరుపాలమ్మ పాల్గొన్నారు. 


రుద్రవరం: బాలికల చదువు దేశానికి వెలుగునిస్తుందని ఇన్‌చార్జి హెచ్‌ఎం శ్రీనివాసరావు, ఎఫ్‌వో నిరంజన్‌రెడ్డి అన్నారు. సోమవారం రుద్రవరం ఉన్నత పాఠశాలలో జాతీయ బాలికా దినోత్సవం నిర్వహించారు. బాలికలు కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయిని సుజాత, ఏఎ్‌సఐ బాలన్న పాల్గొన్నారు.


గడివేముల: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని ఎస్‌ఐ శ్రీధర్‌ అన్నారు. జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా సోమవారం గడివేముల లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నాయని అన్నారు. కార్యక్రమంలో కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ ఎస్‌వో రూబినఅఫ్రిన్‌, ఉపాధ్యాయినులు పాల్గొన్నారు.




Updated Date - 2022-01-25T05:15:54+05:30 IST