ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం

ABN , First Publish Date - 2022-01-26T06:41:14+05:30 IST

జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు.

ఘనంగా జాతీయ ఓటరు దినోత్సవం
కలెక్టరేట్‌లో ప్రతిజ్ఞ చేస్తున్న కలెక్టర్‌, అధికారులు

పెద్దపల్లి కల్చరల్‌, జనవరి 25 : జాతీయ ఓటరు దినోత్సవాన్ని జిల్లాలో ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం కలెక్టర్‌ కార్యాలయంలో జా తీయ ఓటర్‌ దినోత్సవం సంధర్బంగా జిల్లా అధికారులు, కార్యాలయ సి బ్బందిచే కలెక్టర్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఎటువంటి ఒత్తిడులకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ అధికారులు, కార్యాలయ సిబ్బందిచే ప్రతిజ్ఞ చే యించారు. ఈ సంధర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఓటు హక్కు రాజ్యాం గం కల్పించిన బాధ్యత అని ఓటు హక్కు ప్రాముఖ్యత, ఎన్నికల సంఘం చేసిన సంస్కరణలను వివరించారు. కొత్తగా ఓటరు గుర్తింపు కార్డు పొందాలంటే మీ సేవ, నెట్‌ కేంద్రం నుంచి దరఖాస్తు చేసుకోవడంతో పాటు సాంకేతికత పెంపొందడంతో స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. ఓటర్‌ హెల్డ్‌ లైన్‌ యాప్‌ ద్వారా ఓటు హక్కు నమోదు, మార్పులు చేర్పులు సవరణలు అవకాశం ఏర్పడటంతో సేవల్లో పారదర్శకత ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ, జిల్లా అధికారులు, కలెక్టరేట్‌ పాలనాధికారి కేవై ప్రసాద్‌, పెద్దపల్లి తహశీల్దార్‌ శ్రీనివాస్‌, ఎన్నికల డిప్యూటి తహశీల్దార్‌ ప్రవీణ్‌, కార్యాలయ సిబ్బంది , ఓటర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-26T06:41:14+05:30 IST