Abn logo
Sep 26 2021 @ 00:37AM

ఘనంగా పండిత్‌ దీన్‌దయాళ్‌ జయంతి వేడుకలు

నిర్మల్‌లో పండిత్‌ దీన్‌ దయాళ్‌ జయంతి వేడుకలు నిర్వహిస్తున్న దృశ్యం

నిర్మల్‌ టౌన్‌, సెప్టెంబరు 25 : పండిత్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ జయంతి వేడుకలను భారతీయ జనతాపార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయం ముందు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అయ్యన్నగారి భూమయ్య, గాదే విలాస్‌, రావుల రాము, అయ్యన్నగారి రాజేందర్‌, అల్లం భాస్కర్‌, రామోజీ నరేష్‌, తోట సత్యనారాయణ, సాయికృష్ణ, ప్రవీణ్‌, తదితరులు పాల్గొన్నారు. 

ఖానాపూర్‌, సెప్టెంబర్‌ 25 : మండల కేంద్రంలో శనివారం బీజేపీ ఆఽధ్వర్యంలో పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు కాలనీల్లో మొక్కలు నాటారు. అనంతరం బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పడాల రాజశేఖర్‌ మాట్లాడుతూ దీన్‌దయాల్‌ ఉపాఽధ్యాయ యొక్క సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు సంతోష్‌, ఐటి సెల్‌ నియోజకవర్గ ఇంచార్జీ కొండ సురేష్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. 

భైంసా, సెప్టెంబరు 25 : ఏకాత్మ మానవతావాదాన్ని ప్రవచించి అంత్యోదయ విధానాన్ని రూపొందించిన పండిట్‌ దీన్‌ దయాల్‌ ఉపాద్యాయ ఆశయసాధనకు పార్టీ శ్రేణులు అంకితమవ్వాలని బీజేపీ జిల్లా ప్రతినిధి బోస్లే మోహన్‌రావ్‌ పటేల్‌ పిలుపునిచ్చారు. శనివారం భైంసా పట్టణంలో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన పండిట్‌ దీన్‌దయాల్‌ జయంతి కార్యక్రమంలో పాల్గొని  మాట్లాడారు. తన జీవిత కాలంలో పండిట్‌ దీన్‌దయాల్‌ చేపట్టిన వివిధ సేవా కార్యక్రమాలను వివరిం చారు. ఈ సందర్భంగా పండిట్‌ దీన్‌దయాల్‌ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఇందులో మున్సిపల్‌ బీజేపీ ఫ్లోర్‌లీడర్‌ కపిల్‌షిండే,  ముథోల్‌ మాజీ ఎంపీపీ జాదవ్‌సుభాష్‌పాటిల్‌, మాజీ సింగిల్‌విండో చైర్మెన్‌ డి.శ్రీనివాస్‌, భైంసా బార్‌ అసోసియేషన్‌ ప్రతినిధి తాడేవార్‌ సాయినాథ్‌, ప్రతి నిధులు అల్లెం దిలిప్‌, కోర్వ శ్రీనివాస్‌, రామకృష్ణ, మానిక్‌ దగ్డేతో పాటు ఆయా వార్డుల బీజేపీ ప్రతినిధులు పాల్గొన్నారు. 

కుంటాల, సెప్టెంబరు 25 : పండిత్‌ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ హిందు ధర్మ సంరక్షణ కోసం ఎన్నో త్యాగాలు చేసిన వ్యక్తిఅని అని వక్తలు కొనియాడారు.   శనివారం ఆయన జయంతి సందర్భంగా మండలంలోని కల్లూర్‌, ఓల తదితర గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువు రు నాయకులు మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్‌ గుడ్డేటి నర్సయ్య, సీనియర్‌ నాయకులు రవిపాండే, గోపాల్‌ సార్డా, ఓల ఎంపీటీసీ కట్ట రవి, సాదుప్రభాకర్‌,  వెంకన్న, దిగంబర్‌, సాయన్న, తదితరులున్నారు.