ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

ABN , First Publish Date - 2020-09-18T06:10:42+05:30 IST

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

కరీంనగర్‌ టౌన్‌, సెప్టెంబరు 17: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గురువారం నగరంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా కార్యాలయం, ఎంపీ క్యాంపు కార్యాలయాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బాస సత్యనారాయణరావు జాతీయ జెండాలను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్‌ 17ను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసిన అమరవీరుల చరిత్రను పాఠ్యాంశాలుగా చేర్చాలని, నిజాం సేనలు పాశవికంగా చంపిన ప్రదేశాలను పర్యాటకు ప్రదేశాలుగా ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొట్టె మురళీకృష్ణ, కొరటాల శివరామయ్య, అసెంబ్లీ కన్వీనర్‌ దుబాల శ్రీనివాస్‌, నగర అధ్యక్షుడు బేతి మహేందర్‌ రెడ్డి, మాజీ మేయర్‌ డి శంకర్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బోయినపల్లి ప్రవీణ్‌రావు, బీజేపీ నగర ప్రధాన కార్యదర్శి బండ రమణారెడ్డి పాల్గొన్నారు. 


58వ డివిజన్‌లో కార్పొరేటర్‌, బీజేపీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు రాపర్తి విజయ ఆధ్వర్యంలో, 38వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కచ్చు రవి, 39వ డివిజన్‌లో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్‌రావు, 22వ డివిజన్‌లో బీజే వైఎం రాష్ట్రకార్యవర్గ సభ్యులు కటకం లోకేష్‌, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బోయినపల్లి ప్రవీణ్‌రావు, 48వ డివిజన్‌ భారత్‌ టాకీస్‌ చౌరస్తాలో ఆ డివిజన్‌ కార్పొరేటర్‌ దుర్శెట్టి అనూప్‌కుమార్‌, 59వ డివిజన్‌ సుష్మాస్వరాజ్‌ చౌరస్తాలో జాతీయ జెండాను ఎగురవేసి విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. డివిజన్‌ ఇన్‌చార్జి రెడ్డె శ్రీనివాస్‌, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి దురిశెట్టి సంపత్‌, జక్కుల నిఖిల్‌, సుదమల్ల నాగరాజు, అవినాష్‌, రాచకొండ రాకేష్‌, శ్రీనివాస్‌, సుధాకర్‌ పటేల్‌, దయ్యాల మల్లేశం, నవీన్‌, సాగర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-18T06:10:42+05:30 IST