ఘనంగా టాయ్‌కాథన్‌-2021 ప్రారంభం

ABN , First Publish Date - 2021-06-23T04:40:28+05:30 IST

గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని

ఘనంగా టాయ్‌కాథన్‌-2021 ప్రారంభం
వర్చువల్‌ ద్వారా టాయ్‌కాథన్‌-2021లో పాల్గొన్న విద్యార్థులు

  • సీఎంఆర్‌సెట్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మూడు రోజులపాటు వర్చువల్‌ ఎడిషన్‌


మేడ్చల్‌ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధి కండ్లకోయలోని సీఎంఆర్‌ కాలేజీ ఆఫ్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ(సీఎంఆర్‌సెట్‌) అటానమస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో మంగళవారం టాయ్‌కాథన్‌-2021 వర్చువల్‌ ద్వారా ఘనంగా ప్రారంభిం చారు. మూడు రోజులపాటు వర్చువల్‌ ఎడిషన్‌ ద్వారా కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. కరోనా కారణంగా టాయ్‌కాథన్‌-2021 సాఫ్ట్‌వేర్‌ ఎడిషన్‌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ ఫాం ద్వారా సీఎంఆర్‌సెట్‌లో నోడల్‌ కేంద్రంగా జరుగుతుందన్నారు. వర్చువల్‌ మధ్యలో వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు, ప్రతినిధులు కూడా పాల్గొనేట్లు ఇందులో రూపొందించారు. ఎంహెచ్‌ఆర్‌డీ, ఏఐటీసీఈ, ఎంఐసీ, ఆధ్వర్యంలో ప్రతిఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సీఎంఆర్‌సెట్‌ నోడల్‌ కేంద్రంలో వివిధ బృందాలను ఎంపిక చేశారు. టాయ్‌కాథన్‌ -2021లో పాల్గొనే పోటీదారులందరితో భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పరస్పర చర్చ, పరిచయం, ప్రసంగం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. కళాశాల కార్యదర్శి సీహెచ్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. నిత్యం మనం ఎదుర్కొంటున్న కొన్ని సమస్యలను పరిష్కరించడానికి ఒక వేదికను విద్యార్థులకు అందించే ఒక దేశవ్యాప్త ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్స్‌పాల్‌ వి.ఎ.నారాయణ, ఎం.కాంతారెడ్డి, సీహెచ్‌ అభినవ్‌, కె.విజయ్‌కుమార్‌, ఎస్‌.ఫాతిమా, టాయ్‌కాథన్‌ కోఆర్డినేటర్‌ సురేష్‌, డీన్‌లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 



Updated Date - 2021-06-23T04:40:28+05:30 IST