Abn logo
Oct 21 2021 @ 23:56PM

వైభవంగా చెన్నకేశవ స్వామి కల్యాణం

గరుడవాహన సేవలో పాల్గొన్న మేయర్‌ సుజాత తదితరులు

ఒంగోలు(కల్చరల్‌), అక్టోబరు 21: ఒంగోలులో ని శ్రీప్రసన్నచెన్నకేశవ స్వామి దేవస్థానంలో జ రుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణోత్సవం గురువారం అంగరంగ వైభవంగా జరిగింది.  ఈ సందర్భంగా  మంత్రి బాలినేని శ్రీ నివాసరెడ్డి తనయుడు ప్రణీత్‌రెడ్డి స్వామివారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. రాత్రి స్వామివారికి గరుడవాహన సేవ జరిగింది. అనంతరం గరుడ వాహనంపై నగరంలో విహరించారు. అదేవిధం గా ప్రముఖ గాయని ఏల్చూరి అనంతలక్ష్మి, జి.అ చ్యుత్‌, శ్రీదేవి, డాక్టర్‌ చల్లా నాగేశ్వరమ్మ, మనో హర్‌ ఆలపించిన పలు భక్తిగీతాలు, కోలాట ప్రద ర్శనలు భక్తులకు కనువిందు చేశాయి.  నగర మే యర్‌ గంగాడ సుజాత స్వామివారి పూజా కార్య క్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో దేవస్థాన పాలకమండలి చైర్మన్‌ ఈదుపల్లి గురునాథరావు, ఈవో వేమూరి గోపీనాథ్‌, సభ్యులు కరేటి కిర ణ్‌కుమార్‌, పి.గోవర్థన్‌రెడ్డి, కుర్రా ప్రసాద్‌బాబు, ఎన్‌.హరిప్రియాదేవి, అధిక సంఖ్యలో భక్తులు పా ల్గొన్నారు.